- Telugu News Photo Gallery Cinema photos Rakhi Sawant back from Mekka Actress suddenly changed her name as Fathima
Actress: ఇస్లాం మతంలోకి మారిపోయిన ప్రముఖ నటి.. పేరు కూడా మార్చుకుంది.. ఎవరో గుర్తుపట్టారా?
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా? ఆమె ఓ ప్రముఖ నటి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది. హిందీతో పాటు కన్నడ, తెలుగు, మరాఠి, ఒడియా, తమిళ్ సినిమాల్లో నటించింది. అయితే సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు ..
Updated on: Aug 31, 2023 | 7:03 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా? ఆమె ఓ ప్రముఖ నటి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది. హిందీతో పాటు కన్నడ, తెలుగు, మరాఠి, ఒడియా, తమిళ్ సినిమాల్లో నటించింది. అయితే సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి రాఖీ సావంత్..

రాఖీ సావంత్ 1997లో ‘అగ్నిచక్ర’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత హిందీ 'బిగ్ బాస్ సీజన్ 1' , సీజన్ 14లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అయితే సినిమాల కంటే వివాదాల ద్వారానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది రాఖీ సావంత్.

తాజాగా మక్కా యాత్ర నుంచి ముంబైకు తిరిగొచ్చిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె మక్కా యాత్ర అనుభవాలను పంచుకున్నారు. ఇకపై తనను రాఖీ అని పిలవకుండా ఫాతిమా అని పిలవాలని సూచించింది. అంతేకాదు మెడలో పూలమాల వేసిన ఒక అభిమానిని కూడా అడ్డుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది

అధికారిక పత్రాల్లో కూడా రాఖీ సావంత్ తన పేరు మార్చుకుందా? అని మీడియా ప్రతినిధులు అడిగితే.. 'నేను ఎలా ఉన్నా దేవుడు నన్ను ఇష్టపడతాడు. అందుకోసం ఎలాంటి పత్రాల్లో పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు' అని అడ్డదిడ్డంగా సమాధానాలిచ్చింది.

కాగా రాఖీ తన మక్కా సందర్శనకు సంబంధించిన పలు వీడియోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా అల్లా ముందు నిలబడి ఏడుస్తున్న ఫొటో కూడా వైరల్‌గా మారింది. అయితే ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతకుముందు ఆమె నమాజ్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. దీనిని కూడా పబ్లిసిట్ స్టంట్ అంటూ ట్రోల్ చేశారు నెటిజన్స్.





























