AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: దటీజ్‌ మెగాస్టార్‌.. మూలాలను మర్చిపోని చిరంజీవి.. పూజ గదిలో ఆ ఇద్దరి ఫొటోలను చూశారా?

రక్షా బంధన్‌ వేడుకలను మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇద్దరు చెల్లెళ్లు విజయదుర్గ, మాధవి చిరంజీవికి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. అనంతరం అన్నయ్య నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు చిరంజీవి. అందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు

Chiranjeevi: దటీజ్‌ మెగాస్టార్‌.. మూలాలను మర్చిపోని చిరంజీవి.. పూజ గదిలో ఆ ఇద్దరి ఫొటోలను చూశారా?
Chiranjeevi Family
Basha Shek
|

Updated on: Aug 31, 2023 | 6:35 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో చిరంజీవిది ప్రత్యేక స్థానం. ఎలాంటి గాడ్‌ఫాదర్‌ లేకుండా స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగిన ఆయన ఎంతోమందికి స్ఫూర్తి. అయితే సినిమాలపరంగానూ, వ్యక్తిగత జీవిత పరంగానూ చిరంజీవి ఎదుగుదలలో ఆయన మావయ్య ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కృషి కూడా చాలా ఉంది. ఈవిషయాన్ని చిరంజీవే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే .. చాలామంది ఓ స్థాయికి వచ్చిన తర్వాత దానికి కారణమైన వాళ్లని మర్చిపోతుంటారు. అయితే చిరంజీవి మాత్రం అలా చేయలేదు. తనకు జన్మనిచ్చిన తండ్రి కొణిదెల వెంకట్రావుతో పాటు మెగాస్టార్‌గా తన ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించిన అల్లు రామలింగయ్యను అసలు మర్చిపోలేదు. ఏకంగా వారి ఫొటోలను పూజ గదిలో పెట్టుకుని దేవుళ్లతో సమానంగా పూజిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇది కదా మెగాస్టార్‌’. ‘మూలాలను మర్చిపోని చిరంజీవి’ అంటూ అభిమానులు, నెటిజన్లు తెగ లైకులు ,షేర్లు కొట్టేస్తున్నారు.

బింబిసార డైరెక్టర్ తో తర్వాతి సినిమా..

రక్షా బంధన్‌ వేడుకలను మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇద్దరు చెల్లెళ్లు విజయదుర్గ, మాధవి చిరంజీవికి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. అనంతరం అన్నయ్య నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు చిరంజీవి. అందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోలు క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులోనే తన తండ్రి వెంకట్రావు, మావయ్య అల్లు రామలింగయ్య ఫొటోలు కూడా కనిపించాయి. ఇవి అభిమానులను అమితంగ ఆకట్టుకుంటున్నాయి. కాగో భోళాశంకర్‌తో నిరాశపడిన చిరంజీవి ప్రస్తుతం బింబిసార డైరక్టర్‌ మల్లిడి వశిష్టతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు .  సోషియో ఫాంటసీ మూవీగా ఇది తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ దీనిని నిర్మిస్తోంది. దీంతో పాటు తన కూతురు సుస్మిత కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌లోనూ ఓ సినిమాకు పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

ఇవి కూడా చదవండి
Allu Ramalingaiah Photo

Allu Ramalingaiah Photo

చిరంజీవి ఇంట్లో  రక్షాబంధన్ సెలబ్రేషన్స్

మనవరాలు క్లింకారాతో మెగాస్టార్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.