AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: నిమిషానికి కోటి రూపాయల రెమ్యునరేషనా? ఊర్వశి రౌతెలాపై నెటిజన్ల ట్రోల్స్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతెలా ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్యన టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ వ్యవహారంలో ఊర్వశి పేరు బాగా నానింది. ఆ తర్వాత కూడా తన ఫొటోషూట్స్‌, కాంట్రవర్సీ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా మరోసారి ట్రోలింగ్‌ బారిన పడింది ఊర్వశి . తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిమిషానికి కోటి రూపాయలు తీసుకుంటున్నావా

Urvashi Rautela: నిమిషానికి కోటి రూపాయల రెమ్యునరేషనా? ఊర్వశి రౌతెలాపై నెటిజన్ల ట్రోల్స్‌
Urvashi Rautela
Basha Shek
|

Updated on: Aug 30, 2023 | 9:53 PM

Share

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతెలా ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్యన టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ వ్యవహారంలో ఊర్వశి పేరు బాగా నానింది. ఆ తర్వాత కూడా తన ఫొటోషూట్స్‌, కాంట్రవర్సీ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా మరోసారి ట్రోలింగ్‌ బారిన పడింది ఊర్వశి . తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిమిషానికి కోటి రూపాయలు తీసుకుంటున్నావా? అన్న ప్రశ్నకు ఆమె అవుననే సమాధానమివ్వడమే ఈ లేటెస్ట్‌ ట్రోలింగకు కారణం. ‘నిమిషానికి కోటి రూపాయలు తీసుకుంటూ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి మీరేనా? ఇదంతా ఎలా సాధ్యమైంది, ఇంత భారీ రెమ్యునరేషన్‌ రావడంపై మీరేమంటారు?’ అని యాంకర్‌ అడగ్గా.. ‘ ఇది చాలా బాగుంది, స్వయం కృషితో పైకి వచ్చిన ప్రతి నటుడు, నటి ఇలాంటి రోజును చూడాలనుకుంటారు’ అని సమాధానమిచ్చింది ఊర్వశి. అంతే రౌతెలా మాటలు విన్న నెటిజన్లు ఆమెను మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు దీపికా, అలియాలకు కూడా నిమిషానికి కోటి రెమ్యునరేషన్‌ రావడం లేదని, చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా నిమిషానికి కోటి రెమ్యునరేషన్ ఎలా తీసుకుంటారని ఊర్వశిని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల నువ్వు గొప్ప నటిగా ఎదగలేవని, కష్టపడి పైకి రావాలని సూచిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా ఊర్వశి రౌతెల్లా ఇప్పటి వరకు 12-13 సినిమాల్లో మాత్రమే కనిపించింది. అందులో హీరోయిన్లుగా చేసింది చాలా తక్కువే. ఊర్వశి ఎక్కువగా ఐటెం సాంగ్స్‌లో కనిపిస్తుంది. ఇటీవల ఊర్వశిని కేవలం స్పెషల్‌ సాంగ్స్‌లోనే నటిస్తోంది. ఈ క్రమంలో నిమిషానికి కోటి వసూలు చేస్తానని ఆమె చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె ట్రోలింగ్‌ బారిన పడడం ఇదేమి మొదటి సారి కాదు.. గతంలోనూ ఇలాంటి మాటలతో విమర్శల బారిన పడింది. ఇక సినిమాల విషయానికి వస్తే 2022లో విడుదలైన ‘ది లెజెండ్’ సినిమాలో ఊర్వశి హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఊర్వశి ఏ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించలేదు. ఇటీవల తెలుగులో ‘వాల్తేర్‌ వీరయ్య’, ‘ఏజెంట్’, ‘బ్రో’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌ తో సందడి చేసింది. మరో రెండు తెలుగు సినిమాల్లో ఆమె ఇలాగే ప్రత్యేక గీతాల్లో నటించనుంది.

ఇవి కూడా చదవండి

ఊర్వశి రౌతెలా కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా