Vijay Deverakonda: పెళ్లిపీటలెక్కనున్న విజయ్‌ దేవరకొండ! హాట్ టాపిక్‌గా సోషల్ మీడియా పోస్ట్

ఈ ఫొటోలో ఓ అమ్మాయి చేయి విజయ్ దేవరకొండ చేతిలో ఉండడం విశేషం. దీంతో త్వరలోనే విజయ్‌ దేవరకొండ పెళ్లిపీటలెక్కనున్నాడని, ఈ పోస్టుకు ఇదే అర్థమంటూ అభిమానులు, నెటిజన్లు, ఫాలోవర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో ఇదంతా ఖుషి సినిమా ప్రమోషన్లలో భాగంగానే రౌడీ బాయ్ ఇలా చేస్తున్నాడంటూ మరికొందరు స్పందిస్తున్నారు. మరి ఈ ఫొటోకు అర్థమేంటో తెలియాలంటే విజయ్‌నే స్పందించాలి.

Vijay Deverakonda: పెళ్లిపీటలెక్కనున్న విజయ్‌ దేవరకొండ! హాట్ టాపిక్‌గా సోషల్ మీడియా పోస్ట్
Vijay Deverakonda
Follow us
Basha Shek

|

Updated on: Aug 29, 2023 | 8:51 PM

టాలీవుడ్‌ రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ బ్యాచిలర్‌ లైఫ్‌కు బై బై చెప్పనున్నాడా? త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం మంగళవారం (ఆగస్టు 29) సాయంత్రం విజయ్‌ దేవరకొండ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ. ‘చాలా జరుగుతాయి.. కానీ, ఒకటి మాత్రం చాలా స్పెషల్‌- త్వరలోనే ప్రకటిస్తా’ అని ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు విజయ్. ఈ ఫొటోలో ఓ అమ్మాయి చేయి విజయ్ దేవరకొండ చేతిలో ఉండడం విశేషం. దీంతో త్వరలోనే విజయ్‌ దేవరకొండ పెళ్లిపీటలెక్కనున్నాడని, ఈ పోస్టుకు ఇదే అర్థమంటూ అభిమానులు, నెటిజన్లు, ఫాలోవర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో ఇదంతా ఖుషి సినిమా ప్రమోషన్లలో భాగంగానే రౌడీ బాయ్ ఇలా చేస్తున్నాడంటూ మరికొందరు స్పందిస్తున్నారు. మరి ఈ ఫొటోకు అర్థమేంటో తెలియాలంటే విజయ్‌నే స్పందించాలి. కాగా సమంతతో విజయ్‌ కలిసి నటించిన ‘ఖుషి’ సినిమా రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ సెప్టెంబర్‌ 1న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభమయ్యాయి.

ప్రమోషన్ కాదు కదా భయ్యా..?

శివ నిర్వాణ తెరకెక్కించిన ఖుషి సినిమాలో జయరాం, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ సినిమాలకే కేరాఫ్‌ అడ్రస్‌ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీని నిర్మించారు. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఖుషి సినిమాను రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాకు హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాగా ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ 

సెప్టెంబర్ 1న ఖుషి సినిమా రిలీజ్

ఆసక్తిరేకేత్తిస్తోన్న  ‘ఖుషి’ సినిమా స్టిల్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!