Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taraka Ratna: తారకరత్న ఫ్యామిలీలో స్పెషల్‌ డే.. నువ్వు పక్కన లేకపోవడం భరించలేనంటూ అలేఖ్య ఎమోషనల్‌

వరుసగా ప్లాఫులొచ్చినా సినిమా ఇండస్ట్రీలోనే నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు తారకరత్న.ఇదే క్రమంలో రాజకీయాల్లోనూ తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరిలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో పాల్గొన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ గుండెపోటు బారిన పడ్డాడు. సుమారు 23 రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన నందమూరి హీరో ఫిబ్రవరి 18న కన్నుమూశాడు.

Taraka Ratna: తారకరత్న ఫ్యామిలీలో స్పెషల్‌ డే.. నువ్వు పక్కన లేకపోవడం భరించలేనంటూ అలేఖ్య ఎమోషనల్‌
Taraka Ratna Family
Follow us
Basha Shek

|

Updated on: Aug 28, 2023 | 6:43 PM

నందమూరి కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోల్లో ‘తారకరత్న’ఒకరు. ఎన్టీఆర్‌ మనవడిగా 2002లో ఒకేసారి తొమ్మిది సినిమాలతో లాంచ్ అయ్యారాయన. ఒకే రోజు ఒకే ముహూర్తంలో ఇన్ని సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరో తారకరత్నే కావడం గమనార్హం. అయితే ఇందులో కొన్ని మాత్రమే రిలీజుకు నోచుకున్నాయి. హీరోగా తారకరత్నకూ ఫెయిల్యూర్స్‌ వచ్చాయి. అయితే అమరావతి సినిమాలో కరడుగట్టిన విలన్‌గా ఏకంగా నంది పురస్కారం సొంతం చేసుకున్నాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. వరుసగా ప్లాఫులొచ్చినా సినిమా ఇండస్ట్రీలోనే నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు తారకరత్న.ఇదే క్రమంలో రాజకీయాల్లోనూ తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరిలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో పాల్గొన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ గుండెపోటు బారిన పడ్డాడు. సుమారు 23 రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన నందమూరి హీరో ఫిబ్రవరి 18న కన్నుమూశాడు. కాగా తారకరత్న మరణంతో అతనిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్యా రెడ్డి శోకసంద్రంలో మునిగిపోయింది. తన భర్తను తల్చుకుంటూ రోదించడం ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.

నువ్వు మా పక్కన లేకపోవడం భరించలేకపోతున్నా..

అప్పుడప్పుడూ సోషల్ మీడియా వేదికగా తారకరత్నతో తన మధురజ్ఞాపకాలను షేర్‌ చేస్తుంటుంది అలేఖ్యా రెడ్డి. తాజాగా వారి పిల్లల పుట్టిన రోజు సందర్భంగా మరోసారి తన భర్తను గుర్తుచేసుకుందామె. ఇవాళ (ఆగస్టు 28) తారకరత్న కవల పిల్లలు తాన్యారామ్‌, రేయాల బర్త్‌డే. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిందామె. పిల్లలతో తారకరత్న గడుపుతున్న మధురక్షణాలకు సంబంధించిన ఫొటోలను వీడియో రూపంలో పంచుకుంది అలేఖ్య. పెద్ద కూతురు నిష్క తారకరత్న చిత్ర పటానికి పువ్వులతో నివాళి అర్పించడం, అలాగే తాన్య, రేయాలు తండ్రి ఫొటోకు దండం పెట్టడం వంటి దృశ్యాలను మనం ఈ వీడియోలో చెప్పవచ్చు.’ ఈ సంతోషకర క్షణాల్లో ఎంత ప్రయత్నించినా తాన్యరామ్, రేయాలకు ఆనందంగా బర్త్‌ డే విషెస్‌ చెప్పలేకున్నాను. ఇలాంటి సమయంలో మీరు మా పక్కన లేకపోవడం భరించలేకపోతున్నాను. కానీ పిల్లల ముఖాల్లో మీరు ఎప్పుడూ ఉంటారు’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది అలేఖ్య. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలేఖ్యకు ధైర్యం చెబుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..