Tollywood: సిక్స్‌ప్యాక్‌తో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన స్టార్‌ హీరో.. ఎవరో గుర్తుపట్టారా మరి? పాన్‌ ఇండియా ఫేమస్‌

పై ఫొటోలో సిక్స్‌ ప్యాక్‌తో కనిపిస్తోన్న స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? ఇతను ప్రస్తుత పాన్‌ ఇండియా రేంజ్‌లో ఫేమస్‌. తెలుగుతో పాటు కన్నడ, హిందీ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నాడు. హీరో రోల్స్‌తో పాటు విలన్‌గానూ, స్పెషల్‌ రోల్స్‌లోనూ నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గానూ సిల్వర్‌ స్ర్రీన్‌పై సత్తాచాటాడు. ఇక తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో చాలా బాగా తెలుసు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన రెండు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించాడు

Tollywood: సిక్స్‌ప్యాక్‌తో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన స్టార్‌ హీరో.. ఎవరో గుర్తుపట్టారా మరి? పాన్‌ ఇండియా ఫేమస్‌
Actor
Follow us
Basha Shek

|

Updated on: Aug 27, 2023 | 7:35 PM

పై ఫొటోలో సిక్స్‌ ప్యాక్‌తో కనిపిస్తోన్న స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? ఇతను ప్రస్తుత పాన్‌ ఇండియా రేంజ్‌లో ఫేమస్‌. తెలుగుతో పాటు కన్నడ, హిందీ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నాడు. హీరో రోల్స్‌తో పాటు విలన్‌గానూ, స్పెషల్‌ రోల్స్‌లోనూ నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గానూ సిల్వర్‌ స్ర్రీన్‌పై సత్తాచాటాడు. ఇక తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో చాలా బాగా తెలుసు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన రెండు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించాడు. ఈ రెండు మూవీస్‌తోనే చాలా బాగా ఫేమస్ అయిపోయాడీ హీరో. ఆ తర్వాత చిరంజీవి, సల్మాన్‌ వంటి సూపర్‌ స్ట్లార్ల సినిమాల్లోనూ కీ రోల్స్‌ పోషించాడు. ఈపాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. యస్‌. ఆయన మరెవరో కాదు కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌. చివరిగా విక్రాంత్‌ రోణ అనే పాన్‌ ఇండియా సినిమాలో హీరోగా నటించాడీ సూపర్‌స్టార్‌. అందులో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇందుకోసం సిక్స్‌ ప్యాక్‌ బాడీన పెంచి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు సుదీప్‌.

తన 46వ సినిమాలో సుదీప్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించనున్నాడని టాక్‌ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కండలు తిరిగే దేహంతో సుదీప్‌ కనిపించాడు.“వర్కౌట్ చేయడం నాకు సంతోషాన్నిచ్చే కొత్త విషయం. వర్కవుట్ చేయడం నా రోజువారీ జీవితంలో మరింత ఏకాగ్రతతో, ప్రశాంతంగా ఉండటానికి నాకు సహాయపడుతుంది. కిచ్చ 46 సినిమా క్లైమాక్స్ మరో నెల రోజుల్లో చిత్రీకరిస్తాం, అంతకంటే ముందు జిమ్‌లో రెడీ అవ్వాలి’ అని తన సిక్స్‌ ప్యాక్‌ బాడీ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు సుదీప్‌. ప్రస్తుతం అతని ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక సుదీప్‌ 46వ సినిమా టీజర్‌ ఇటీవలే రిలీజైంది. కాగా సుదీప్‌ సిక్స్‌ బ్యాక్‌ పాడీని ప్రదర్శించడం ఇదేమి మొదటిసారి కాదు.గతంలో మల్ల యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన పహిల్వాన్‌ సినిమా కోసం కూడా సిక్స్‌ ప్యాక్‌తో దర్శనమిచ్చాడు. కాగా కిచ్చా 46 సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. భారీ ఫైట్ సీక్వెన్స్‌తో ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడీ ఫైట్ సీక్వెన్స్ కోసం సుదీప్ జిమ్‌లో ఇలా రెడీ అవుతున్నాడు. గతంలో తుపాకి, కబాలి, కర్ణన్‌, అసురన్‌ లాంటి భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించిన వి క్రియేషన్‌ బ్యానర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. దీంతో పాటు ఉపేంద్ర కబ్జా 2 మూవీలోనూ ఓ కీ రోల్‌ పోషిస్తున్నాడు సుదీప్‌.

ఇవి కూడా చదవండి

కిచ్చా సుదీప్ లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.