AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uday Kiran: టాలీవుడ్‌లో టాప్‌ సింగర్‌గా వెలుగొందుతోన్న ఉదయ్‌ కిరణ్‌ చెల్లెలు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఉదయ్‌ కిరణ్‌.. కొన్నేళ్ల పాటు టాలీవుడ్‌ను ఏలిన ఈ హీరో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యా గ్రౌండ్‌ లేకుండా వచ్చి స్టార్‌ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో ఉదయ్‌ కిరణ్‌ ఒకరు. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్‌ కిరణ్‌ నువ్వునేను సినిమాతో స్టార్‌ హీరోగా ఎదిగాడు. మనసంతా నువ్వే, కలుసుకోవాలని నీ స్నేహం, నేను నీకు నాకు నువ్వు, ఔనన్నా కాదన్నా వంటి సినిమాలతో టాలీవుడ్‌లో లవర్‌ బాయ్ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు.

Uday Kiran: టాలీవుడ్‌లో టాప్‌ సింగర్‌గా వెలుగొందుతోన్న ఉదయ్‌ కిరణ్‌ చెల్లెలు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Uday Kiran, Singer
Basha Shek
|

Updated on: Aug 27, 2023 | 6:41 PM

Share

ఉదయ్‌ కిరణ్‌.. కొన్నేళ్ల పాటు టాలీవుడ్‌ను ఏలిన ఈ హీరో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యా గ్రౌండ్‌ లేకుండా వచ్చి స్టార్‌ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో ఉదయ్‌ కిరణ్‌ ఒకరు. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్‌ కిరణ్‌ నువ్వునేను సినిమాతో స్టార్‌ హీరోగా ఎదిగాడు. మనసంతా నువ్వే, కలుసుకోవాలని నీ స్నేహం, నేను నీకు నాకు నువ్వు, ఔనన్నా కాదన్నా వంటి సినిమాలతో టాలీవుడ్‌లో లవర్‌ బాయ్ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా యూత్‌లో ఉదయ్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉండేది. అయితే టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన ఈ హీరో ఒకానొక దశలో అవకాశాలు లేక కుంగుబాటుకు గురయ్యాడు. 2014లో ఆత్మహత్య చేసుకుని అందరినీ విషాదంలో ముంచాడు. ఉదయ్‌ కిరణ్‌ మన మధ్య లేకున్నా అతని సినిమాల రూపంలో ఎల్లప్పుడూ జీవించే ఉంటాడు. కాగా ఉదయ్‌ కిరణ్ గురించి అప్పుడప్పుడు కొన్ని విషయాలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. తాజాగా అతనికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. టాలీవుడ్‌లో టాప్‌ సింగర్‌గా వెలుగొందుతోన్న ఒకరు ఉదయ్‌కిరణ్‌కు సోదరి అవుతుందట. ఆమె ఎవరో కాదు.. బాహుబలి, భీమ్లా నాయక్‌ లాంటి సినిమాల్లో పాటలు ఆలపించిన పర్ణిక మాన్య.

కెరీర్‌ ప్రారంభంలో జీ తెలుగు ‘సారేగమప’ తో వెలుగులోకి వచ్చింది పర్ణిక. ఆ తర్వాత ప్లే బ్యాక్‌ సింగర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా ‘అయుగిరి నందిని’ సాంగ్‌తో అందరినీ తనవైపునకు తిప్పుకుంది. ఇక తెలుగులో పరారే , బ్రహ్మానందం డ్రామా కంపెనీ, తెలుగమ్మాయి, బాడీగార్డ్, దేనికైనా రెడీ, గ్రీకు వీరుడు, బాహుబలి, రభస, కవచం, భీమ్లానాయక్‌తో సహా 50కు పైగా సినిమాల్లో పాటలు ఆలపించింది. కాగా సింగర్‌ పర్ణికకు ఉదయ్‌ కిరణ్‌ అన్నయ్య అవుతాడు. దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ట్యాలెంటెడ్‌ సింగర్‌.’ మా పెద్దమ్మ కొడుకే ఉదయ్‌ కిరణ్‌. మా మధ్య మంచి అనుబంధం ఉండేది. అన్నయ్య ఎంతో మంచి మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి దూరం కావడం మా దురృష్టకరం. అయితే అన్నయ్య పేరును ఇండస్ట్రీలో నేను ఎప్పుడూ ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు’ అని తెలిపింది సింగర్‌ పర్ణిక. కాగా సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది పర్ణిక. తరచుగా తన ఫ్యామిలీ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

సింగర్ పర్ణిక లేటెస్ట్ ఫొటోస్

సింగర్ పర్ణిక లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.