AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: బన్నీ ఇంట్లో అంబరాన్నంటిన సంబరాలు.. తండ్రికి పాదాభివందనం.. భార్యాపిల్లలకు స్వీట్‌ హగ్స్‌.. వీడియో చూశారా?

69 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం గెల్చుకోవడం ఇదే మొదటిసారి. ఈ రికార్డును అల్లు అర్జున్‌ అందుకున్నాడు. పుష్ప సినిమా తన అద్భుతమైన నటనకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా జాతీయ అవార్డుకు బన్నీ ఎంపికయ్యాడని తెలియగానే అతని ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. అల్లు కుటుంబ సభ్యులతో పాటు, పుష్ప టీమ్‌ మొత్తం ఒకే చోట చేరి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.

Allu Arjun: బన్నీ ఇంట్లో అంబరాన్నంటిన సంబరాలు.. తండ్రికి పాదాభివందనం.. భార్యాపిల్లలకు స్వీట్‌ హగ్స్‌.. వీడియో చూశారా?
Allu Arjun Family Celebrations
Basha Shek
|

Updated on: Aug 25, 2023 | 7:56 AM

Share

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. సోషల్‌ మీడియాలో పుష్పరాజ్ పేరు మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా అల్లు అర్జున్‌, పుష్పల పేర్లే వినిపిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా గురువారం (ఆగస్టు 24)న జరిగిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పుష్ప సినిమా రెండు అవార్డులు కైవసం చేసుకుంది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్‌ అవార్డులకు ఎంపికయ్యారు. కాగా 69 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం గెల్చుకోవడం ఇదే మొదటిసారి. ఈ రికార్డును అల్లు అర్జున్‌ అందుకున్నాడు. పుష్ప సినిమా తన అద్భుతమైన నటనకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా జాతీయ అవార్డుకు బన్నీ ఎంపికయ్యాడని తెలియగానే అతని ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు, పుష్ప టీమ్‌ మొత్తం ఒకే చోట చేరి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.

జాతీయ అవార్డుల ప్రకటన వెలువడగానే కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. పుష్ప డైరెక్టర్‌ సుకుమార్‌ అల్లు అర్జున్‌ని గట్టిగా కౌగిలించుకున్నారు. ముఖ్యంగా సుకుమార్‌ ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. ఇక అక్కడే ఉన్న తండ్రి అల్లు అరవింద్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం చేసుకున్నాడు బన్నీ. ఆ తర్వాత భార్య అల్లు స్నేహతో పాటు పిల్లలకు స్వీట్‌ హగ్స్‌ ఇచ్చాడు. అలాగే పుష్ప నిర్మాతలు నవీన్, రవిశంకర్ కూడా బన్నీని ఆప్యాయతతో హత్తుకున్నారు. మొత్తానికి బన్నీ అవార్డుకు రావడంతో సంబరాలు అంబరాన్నంటాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక బన్నీకి సినీ సెలబ్రిటీల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

సీఎం జగన్ విషెస్

 బన్నీ సెలబ్రేషన్స్ వీడియో

అల్లు అర్జున్ ఇంట్లో సంబరాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి