Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Praggnanandhaa: ఓడినా మనసులు గెల్చుకున్న ప్రజ్ఞానంద.. చెస్ రారాజుకే ముచ్చెమటలు.. సర్వత్రా ప్రశంసలు

అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన చెస్ ప్రపంచకప్‌ ఫైనల్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్‌ టై బ్రేకర్‌ పోరులో కార్ల్‌సన్‌ భారత గ్రాండ్‌ మాస్టర్‌, 18 ఏళ్ల ప్రజ్ఞానందపై కార్ల్‌సన్‌ గెలుపొందాడు. కాగా సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో ​​కరువానాను ఓడించిన ప్రజ్ఞానంద్ ఫైనల్‌లోనూ అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. ఎదురుగా ఉన్నది ప్రపంచ వన్‌ నంబర్‌వన్‌ ప్లేయర్‌ అన్న ఒత్తిడి లేకుండా ఆడాడు. మొదటి రెండు గేమ్‌ల్లోనూ డ్రా చేసుకుని మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు ముచ్చెమటలు పట్టించాడు.

Praggnanandhaa: ఓడినా మనసులు గెల్చుకున్న ప్రజ్ఞానంద.. చెస్ రారాజుకే ముచ్చెమటలు.. సర్వత్రా ప్రశంసలు
Praggnanandhaa
Follow us
Basha Shek

|

Updated on: Aug 24, 2023 | 7:18 PM

అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన చెస్ ప్రపంచకప్‌ ఫైనల్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్‌ టై బ్రేకర్‌ పోరులో కార్ల్‌సన్‌ భారత గ్రాండ్‌ మాస్టర్‌, 18 ఏళ్ల ప్రజ్ఞానందపై కార్ల్‌సన్‌ గెలుపొందాడు. కాగా సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో ​​కరువానాను ఓడించిన ప్రజ్ఞానంద్ ఫైనల్‌లోనూ అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. ఎదురుగా ఉన్నది ప్రపంచ వన్‌ నంబర్‌వన్‌ ప్లేయర్‌ అన్న ఒత్తిడి లేకుండా ఆడాడు. మొదటి రెండు గేమ్‌ల్లోనూ డ్రా చేసుకుని మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. ఇక గురువారం హోరాహోరీగా జరిగిన టై బ్రేక్స్‌ పోరులో ప్రజ్ఞానంద తొలి గేమ్‌ కోల్పోయాడు. ఇక రెండో గేమ్‌ను ఇరువురు డ్రాకు అంగీకరించడంతో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. దీంతో మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న భారతీయ కుర్రాడి కల నెరవేరలేదు. ప్రపంచకప్‌ టోర్నీ ఆధ్యాంతం దూకుడిగా ఆడిన ప్రజ్ఞానంద ఫైనల్‌లో కాస్త ఒత్తిడికి గురయ్యాడు. కార్ల్‌సన్‌ అనుభవం ముందు నిలవలేకపోయాడు. కాగా ఫైనల్‌లో ఓడిపోయినా అందిర మనసులు గెల్చుకున్నాడు భారత గ్రాండ్‌మాస్టర్‌. ముఖ్యంగా వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు ముచ్చెమటలు పట్టించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు.

ప్రపంచకప్‌ టోర్నీలో ప్రజ్ఞానంద్ ప్రయాణం సాగిందిలా..

  • మొదటి రౌండ్లో ప్రజ్ఞానంద్ కు బై లభించింది.
  • రెండో రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన మాక్సిమ్ లగార్డ్‌ను 1.5 – 0.5 తేడాతో ఓడించాడు.
  • మూడో రౌండ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన డేవిడ్ నవరాను 1.5- 0.5 తేడాతో ఓడించాడు.
  • నాలుగో రౌండ్‌లో వరల్డ్‌ రెండో నంబర్ ఆటగాడు అమెరికాకు చెందిన హికారు నకమురాను నాలుగో రౌండ్‌లో 3-1తో ఓడించాడు.
  • 5వ రౌండ్‌లో హంగేరీకి చెందిన ఫెరెంగ్ బెర్క్స్‌ను 1.5- 0.5 తేడాతో ఓడించాడు.
  • ఆరో రౌండ్‌లో అతను 5-4తో స్వదేశానికి చెందిన అర్జున్ ఎరిగీని ఓడించాడు.
  • సెమీ ఫైనల్ లో ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు ఫాబియానో ​​కరువానా 3.5- 2.5తో ఓడించాడు.
  • ఫైనల్లో మాగ్నస్ కార్ల్‌సెన్ 0.5-1.5తో ఓడిపోయాడు.

సర్వత్రా ప్రశంసల వర్షం

ఖాతాలో పలు రికార్డులు..

కాగా చెస్ ప్రపంచ కప్‌లో ఫైనల్ ఆడిన రెండో భారతీయ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద. గతంలో 2000, 2002లో గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనత అందుకున్నాడు. ఈక్రమంలో విశ్వనాథన్ ఆనంద్ తో సహా పలువురు ప్రమఖులు ప్రజ్ఞానందకు అభినందనలు ,శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..