AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న రజనీకాంత్ ‘జైలర్‌’! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'జైలర్‌' బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. పెద్దగా అంచనాలు లేకుండా ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇప్పటివరకు రూ.550 కోట్లకు పైగా సాధించింది. కేవలం తమిళ్‌లోనే కాదు తెలుగులోనూ రజనీ సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన జైలర్‌ సినిమాలో కన్నడ సూపర్ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ కీలక పాత్రలు పోషించారు

Jailer OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న రజనీకాంత్ 'జైలర్‌'! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Rajinikanth Jailer Movie
Basha Shek
|

Updated on: Aug 23, 2023 | 4:54 PM

Share

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. పెద్దగా అంచనాలు లేకుండా ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇప్పటివరకు రూ.550 కోట్లకు పైగా సాధించింది. కేవలం తమిళ్‌లోనే కాదు తెలుగులోనూ రజనీ సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన జైలర్‌ సినిమాలో కన్నడ సూపర్ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ కీలక పాత్రలు పోషించారు. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌, యోగి బాబు, జాకీ ష్రాఫ్, వినాయకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. కాగా జైలర్‌ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. దీంతో ‘తలైవా ఈజ్‌ బ్యాక్‌’ అంటూ రజనీ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికీ థియేటర్లలో జైలర్‌ సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. అయితే రజనీ మూవీ ఓటీటీ రిలీజ్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుందట. జైలర్‌ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సన్‌ నెక్ట్స్‌ సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం సెప్టెంబర్‌ 7 నుంచే రజనీ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక జైలర్‌ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ కూడా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అదే రోజు రిలీజ్ కానుందని సమాచారం.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. జైలర్‌ సినిమాను తెలుగులో ఏషియన్‌ సునీల్‌ నారంగ్‌తో కలిసి దిల్‌ రాజు విడుదల చేశారు. ఇక్కడ రిలీజైన మొదటి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ సాధించడం విశేషం. రజనీ ఛరిష్మా, అనిరుధ్‌ బీజీఎమ్‌, ఇక శివన్నల క్యామియో రోల్స్‌ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కాగా థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమాలు వస్తున్నాయి. అయితే జైలర్‌ మాత్రం నెలరోజుల్లోపే రానుండడం గమనార్హం. ఇది రజనీ అభిమానులకు ఫుల్‌ కిక్‌ ఇచ్చే న్యూస్‌ అని చెప్పవచ్చు. కాగా జైలర్‌ ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి సినిమాను త్వరగా పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడు రజనీకాంత్‌. త్వరలోనే తన నెక్ట్స్‌ ప్రాజెక్టు గురించి ప్రకటన వెలవడనుంది.

ఇవి కూడా చదవండి

జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్ డేట్

సన్ పిక్చర్స్ బ్యానర్ ట్విట్టర్ పోస్టులివే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
పవన్ 'బాలు' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పవన్ 'బాలు' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?