Prabhas: చిరంజీవి బర్త్ డే ట్రీట్.. ప్రభాస్ ‘కల్కి’ నుంచి అదిరిపోయే అప్డేట్.. అచ్చం మెగాస్టార్ లాగే..
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బోల్తాపడడంతో పాన్ ఇండియా హీరో ఫ్యాన్స్ కల్కి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెస్ చెబుతూ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ప్రభాస్ కల్కి సినిమా ఎడిటింగ్ రూమ్‌లోని ఓ వీడియోను షేర్ చేసింది.
![Prabhas: చిరంజీవి బర్త్ డే ట్రీట్.. ప్రభాస్ 'కల్కి' నుంచి అదిరిపోయే అప్డేట్.. అచ్చం మెగాస్టార్ లాగే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/prabhas-chiranjeevi.jpg?w=1280)
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె జంటగా నటిస్తోన్న చిత్రం ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, పశుపతి లాంటి దిగ్గజ నటీనటులు ఈ సినిమాలో నటిస్తుండడంతో కల్కిపై భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజైన టైటిల్ గ్లింప్స్, ప్రభాస్ పోస్టర్లు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బోల్తాపడడంతో పాన్ ఇండియా హీరో ఫ్యాన్స్ కల్కి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెస్ చెబుతూ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ప్రభాస్ కల్కి సినిమా ఎడిటింగ్ రూమ్‌లోని ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ప్రభాస్ ఏదో గ్యాడ్జెట్ కోసం వెల్డింగ్ చేస్తూ చేస్తూ కనిపించాడు. ఎలా అంటే గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి పోర్టబుల్ గ్యాస్ బర్నర్ మండిస్తూ ఎలా స్టైలిష్‌గా కనిపించాడో ఇప్పుడు అదే సీన్‌ని రీక్రియేట్ చేశారు కల్కి మేకర్స్. దీనికి తగ్గట్టుగానే గ్యాంగ్ లీడర్ మ్యూజిక్‌ను జత చేసి వీడియోను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా కల్కి సినిమా ఎడిటింగ్ రూమ్ నుంచి ఈ సీన్ లీక్ చేశామన్న మేకర్స్.. తాము కూడా చిరు లీక్స్ నుంచి స్ఫూర్తి పొందామన్నారు. ఈ వీడియోకు ‘స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్స్ అండ్ ఎడిటింగ్ రూమ్ ఆఫ్ కల్కి 2898 ఏడీ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు మెగాభిమానులు, ప్రభాస్ అభిమానులు ఈ వీడియోను చూసి తెగ ఖుషి అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం ఈ వీడియోపై స్పందించారు. కల్కి రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్ పెట్టాడు. మరి మెగాభిమానులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్‌ను తెగ ఖుషి చేస్తోన్న కల్కి ఎడిటింగ్ రూం వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/chiranjeevi-pawan-kalyan.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/master-peace-web-series.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/chiranjeevi-uttej-daughter.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/bhola-shankar-movie-5.jpg)
ప్రభాస్ కల్కి లేటెస్ట్ వీడియో
Straight from the hearts and the editing room of #Kalki2898AD 👀
Here’s wishing our Megastar @KChiruTweets garu an extraordinary birthday!
Inspired by #ChiruLeaks 😉 pic.twitter.com/uFrJp8Rx9T
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 22, 2023
ఫ్యాన్స్ రియాక్షన్ ఇవే!
Rebel Star Prabhas and Team #Kalki2898AD sharing their MEGASTAR @KChiruTweets fan Moment 🤩🤩#HBDMegastarChiranjeevi 🌟👑 pic.twitter.com/rmknYvMs88
— Ujjwal Reddy (@HumanTsunaME) August 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.