Bhola Shankar OTT: ముందుగానే ఓటీటీలోకి ‘భోళాశంకర్‌’! మెగాస్టార్‌ లేటెస్ట్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన భోళాశంకర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఎప్పటిలాగే మెగాస్టార్ చిరంజీవి తనదైన యాక్టింగ్‌ స్టైల్‌, డ్యాన్స్‌, యాక్షన్‌, మేనరిజమ్స్‌తో మెప్పించినా.. మెహర్‌ రమేష్‌ టేకింగ్‌, డైరెక్షన్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రియులను బాగా నిరాశపర్చింది.

Bhola Shankar OTT: ముందుగానే ఓటీటీలోకి 'భోళాశంకర్‌'! మెగాస్టార్‌ లేటెస్ట్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Bhola Shankar Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2023 | 8:06 PM

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళాశంకర్‌’. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటించగా, మహానటి కీర్తి సురేష్‌ సోదరిగా కనిపించింది. అక్కినేని సుశాంత్‌ ఓ కీలక పాత్రలో మెరిశాడు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన భోళాశంకర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఎప్పటిలాగే మెగాస్టార్ చిరంజీవి తనదైన యాక్టింగ్‌ స్టైల్‌, డ్యాన్స్‌, యాక్షన్‌, మేనరిజమ్స్‌తో మెప్పించినా.. డైరెక్టర్‌ మెహర్‌ రమేష్‌ టేకింగ్‌ అభిమానుతో పాటు సినీ ప్రియులను బాగా నిరాశపర్చింది. సుమారు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన భోళాశంకర్‌ ఓ మోస్తారు వసూళ్లు మాత్రమే సాధించింది. ఇదిలా ఉంటే చిరంజీవి సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి సోషల్‌ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. అనుకున్న సమయానికంటే ముందుగానే భోళాశంకర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోందట.

ముందుగానే ఓటీటీలోకి..

భోళాశంకర్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా రూ.30 కోట్లకు పైగానే అగ్రిమెంట్ కుదుర్చుకుందట. ఒప్పందం ప్రకారం థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని తొలుత భావించారట. అయితే సినిమాకు నెగెటివ్‌ టాక్‌ రావడంతో ముందుగానే మెగాస్టార్‌ సినిమాను డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారని టాక్‌ వినిపిస్తోంది. సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం సెప్టెంబర్‌ 18 నుంచి భోళాశంకర్‌ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి తీసుకురానున్నరని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర భోళాశంకర్‌ సినిమాను నిర్మించారు. శ్రీముఖి, రష్మీ గౌతమ్‌, మురళీ శర్మ, రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, గెటప్ శీను తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి ఇన్ స్టా పోస్ట్

View this post on Instagram

A post shared by GenepoweRx (@genepowerx)

భోళా శంకర్ ఓటీటీ రైట్స్

చిరంజీవి లేటెస్ట్ ఫ్యామిలీ ఫొటో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..