Master Peace OTT: తెలుగులో రానున్న మలయాళం వెబ్‌ సిరీస్‌.. నిత్యామేనన్‌ మాస్టర్‌ పీస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్రముఖ హీరోయిన్‌ నిత్యా మేనన్‌ సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఇటీవల 'బ్రీత్.. ఇన్‌ టు ద షాడోస్‌', సీజన్‌ 1’, సీజన్‌2, 'మోడ్రన్‌ లవ్‌' వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందీ అందాల తార. త్వరలోనే మరో వెబ్‌ సిరీస్‌తో మన ముందుకు రానుంది నిత్య. ఆమె నటించిన లేటెస్ట్‌ మలయాళం వెబ్‌ సిరీస్‌ మాస్టర్‌ పీస్‌. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన..

Master Peace OTT: తెలుగులో రానున్న మలయాళం వెబ్‌ సిరీస్‌.. నిత్యామేనన్‌ మాస్టర్‌ పీస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Master Peace Web Series
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2023 | 9:22 PM

ప్రముఖ హీరోయిన్‌ నిత్యా మేనన్‌ సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఇటీవల ‘బ్రీత్.. ఇన్‌ టు ద షాడోస్‌’, సీజన్‌ 1’, సీజన్‌2, ‘మోడ్రన్‌ లవ్‌’ వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందీ అందాల తార. త్వరలోనే మరో వెబ్‌ సిరీస్‌తో మన ముందుకు రానుంది నిత్య. ఆమె నటించిన లేటెస్ట్‌ మలయాళం వెబ్‌ సిరీస్‌ మాస్టర్‌ పీస్‌. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో షరాఫ్‌, రెంజి పనికర్‌, మాలా పార్వతి, అశోకన్‌, శాంతి కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీజిత్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న మాస్టర్‌ పీస్‌ వెబ్‌ సిరీస్‌ త్వరలోనే ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీతో పాటు ప‌లు భార‌తీయ భాష‌ల్లో ఈ మాస్టర్‌ పీస్‌ వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి చిన్న టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. దీనిని చూస్తుంటే ఆద్యంతం నవ్వులు పంచేలా మాస్టర్‌ పీస్‌ సిరీస్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

కాగా కేర‌ళ క్రైమ్ ఫైల్స్ త‌ర్వాత డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్న రెండో మ‌ల‌యాళం వెబ్‌సిరీస్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక భీమ్లా నాయక్‌ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు నిత్యా మేనన్‌. అయితే ఆహా ఇండియన్‌ ఐడల్ షో జడ్జిగా ఓటీటీ ఆడియెన్స్‌కు వినోదం పంచింది. ప్రస్తుతం తమిళ్‌, మలయాళ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోందీ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌. గతేడాది ధనుష్‌ సరసన ఆమె నటించిన తిరు సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో కోలాంటి, ఆరమ్‌ తిరుకల్పన వంటి మలయాళ మూవీస్‌తో పాటు ఒక తమిళ సినిమా ఉంది. అలాగే శ్రీమతి కుమారి అనే ఓ తెలుగు వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

నిత్యా మేనన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ 

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

నిత్యా మేనన్ లేటెస్ట్ ఇన్ స్టా పోస్ట్

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ టీజర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!