Malashree: అందాల తార మాలాశ్రీ కూతురును చూశారా? అందంలో అమ్మను మించి.. పేరు మార్చుకుని మరీ హీరోయిన్‌గా ఎంట్రీ

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రీమ్‌గర్ల్‌గా వెలుగొందిన మాలాశ్రీ మన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. బ్యూటీ క్వీన్‌ గానే కాకుండా యాక్షన్ క్వీన్ గా కూడా తెరపై మెరిసిందీ అందాలతార. ఇక తెలుగులో సుమన్‌తో కలిసి ఎక్కువ సినిమాలు చేసిందామె. ఘరానా అల్లుడు, బావ బావమరిది, తోడి కోడళ్లు, ప్రేమ ఖైదీ, పోలీస్ అల్లుడు, సాహస వీరుడు సాగర కన్య తదితర హిట్‌ సినిమాల్లో జోడీగా అలరించారు సుమన్, మాలాశ్రీ.

Malashree: అందాల తార మాలాశ్రీ కూతురును చూశారా? అందంలో అమ్మను మించి.. పేరు మార్చుకుని మరీ హీరోయిన్‌గా ఎంట్రీ
Malashree Daughter
Follow us
Basha Shek

|

Updated on: Aug 20, 2023 | 12:28 PM

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రీమ్‌గర్ల్‌గా వెలుగొందిన మాలాశ్రీ మన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. బ్యూటీ క్వీన్‌ గానే కాకుండా యాక్షన్ క్వీన్ గా కూడా తెరపై మెరిసిందీ అందాలతార. ఇక తెలుగులో సుమన్‌తో కలిసి ఎక్కువ సినిమాలు చేసిందామె. ఘరానా అల్లుడు, బావ బావమరిది, తోడి కోడళ్లు, ప్రేమ ఖైదీ, పోలీస్ అల్లుడు, సాహస వీరుడు సాగర కన్య తదితర హిట్‌ సినిమాల్లో జోడీగా అలరించారు సుమన్, మాలాశ్రీ. కన్నడ, తెలుగులోనే కాదు తమిళ్‌లోనూ నటించి మెప్పించిందామె. నేడు సినీ రంగంలోకి వస్తున్న ఎందరో యువతులకు మాలాశ్రీ స్ఫూర్తి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆమె కూతురు కూడా సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది. కొత్త విషయం ఏంటంటే.. తాజాగా మాలాశ్రీ కూతురు పేరు మార్చుకుంది. చాలా కాలంగా ఆమెను అనన్య, రాధన అనే పేర్లతో పిలిచేవారు. ఇప్పుడు తన పేరు మారింది. మాలాశ్రీ తన కూతురికి ఆరాధన అని కొత్త పేరు పెట్టింది . దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆమె అధికారికంగా పంచుకున్నారు. ‘అందరికీ నమస్కారం. నేను మీ రాథనా రామ్‌ని. ఈరోజు నుండి నా పేరు ఆరాధన అనే విషయాన్ని మీకు అందించాలనుకుంటున్నాను. ఈ మార్పు కోసం మీ ఆశీస్సులు కోరుతున్నాను. మీ ప్రేమ, అభిమానం, మద్దతుకు ధన్యవాదాలు. ఇవి ఎప్పటికీ నాపై ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది మాలాశ్రీ కూతురు.

కాగా రాము, మాలాశ్రీ దంపతుల గారాల పట్టే ఆరాధన. త్వరలోనే ఆమె హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కానుంది. మొదటి సినిమాలోనే ఏకంగా కన్నడ ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుందీ అందాల తార. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు,కన్నడ , మలయాళం, తమిళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రాబర్ట్‌ ఫేమ్‌ తరుణ్ సుధీర దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే ఆరాధన లేటెస్ట్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందంలో అమ్మను మించిపోయిందిగా అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి మాలాశ్రీ కూతురు లేటెస్ట్‌ ఫొటోలపై ఓ లుక్కేద్దాం రండి.

ఇవి కూడా చదవండి

మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి: ఆరాధన

కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా నటిస్తోన్న డీ56 (వర్కింగ్ టైటిల్) లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఆరాధన..

కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ,మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో డీ56 రిలీజ్ కానుంది..

కాగా సినిమాల్లోకి రాక ముందే ముంబైలో నటన, డ్యాన్స్ నేర్చుకుంది ఆరాధన.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?