AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana: సింగిల్‌ మదర్స్‌ను చూసి చలించిపోయా.. ఒంటరి తల్లుల కోసం అపోలోలో ఉచిత ఓపీడీ సేవలను ప్రారంభించిన ఉపాసన

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో అపోలో చిల్డ్రన్స్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. సింగిల్ మదర్స్‌ కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ సేవలను ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉంది. అవసరమైన తల్లులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇందుకోసం 040 -23607777 నంబర్‌కు కాల్‌ చేసి మీ స్లాట్‌ను ముందుగా బుక్ చేసుకోండి. ప్రతి ఆదివారం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు ఈసేవలు అందుబాటులో ఉంటాయి.

Upasana: సింగిల్‌ మదర్స్‌ను చూసి చలించిపోయా.. ఒంటరి తల్లుల కోసం అపోలోలో ఉచిత ఓపీడీ సేవలను ప్రారంభించిన ఉపాసన
Upasana, Ram Charan
Basha Shek
|

Updated on: Aug 12, 2023 | 6:15 AM

Share

మెగాస్టార్‌ చిరంజీవి కోడలు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన కొణిదెల. ఓవైపు సీఎస్ఆర్ అపోలో వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. మహిళలు, మూగజీవాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది. తాజాగా మరో మంచి పనికి శ్రీకారం చుట్టారామె. ఇటీవలే అమ్మగా ప్రమోషన్‌ పొందిన ఉపాసన సింగిల్‌ మదర్స్‌ కోసం అపోలో ఆస్పత్రిలో ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ) సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జూబ్లీహిల్స్ అపోలో చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది మెగా కోడలు. అనంతరం ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ మేరకు ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. ‘సంతాన సాఫల్యతతో ఎదురయ్యే సవాళ్లను, సింగిల్‌ మదర్స్‌ను చూసి నేను తీవ్రంగా చలించిపోయా. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో అపోలో చిల్డ్రన్స్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. సింగిల్ మదర్స్‌ కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ సేవలను ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉంది. అవసరమైన తల్లులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇందుకోసం 040 -23607777 నంబర్‌కు కాల్‌ చేసి మీ స్లాట్‌ను ముందుగా బుక్ చేసుకోండి. ప్రతి ఆదివారం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు ఈసేవలు అందుబాటులో ఉంటాయి. అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగంలోని ప్రత్యేక శిశు వైద్యుల బృందం అత్యాధునిక సాంకేతికతతో మిమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉంది. పుట్టిన ప్రతి బిడ్డకు సమగ్ర సంరక్షణ అందేలా వాతావరణాన్ని రూపొందించడమే మా లక్ష్యం’ అని వీడియోలో చెప్పుకొచ్చింది ఉపాసన.

పలువురి ప్రశంసలు..

ప్రస్తుతం మెగా కోడలి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉపాసన చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నారంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా జూన్‌లో ఉపాసన ఆడబిడ్డను ప్రసవించింది. తనకు క్లింకార కొణిదెల అని నామకరణం చేసింది. ప్రస్తుతం తన కూతురి ఆలనాపాలనలో బిజిబిజీగా ఉంటోంది. కాగా రామ్‌చరణ్‌ విషయానికొస్తే.. ప్రస్తుత గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. సెన్షేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కియారా ఆద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, సునీల్, నవీన్‌ చంద్ర, సముద్రఖని, నాసర్‌, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఉపాసన ఇన్ స్టా వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.