Parthudu OTT: ఓటీటీలోకి మరో మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా.. ప్రకాశ్‌ రాజ్‌ పార్థుడు స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజ జీవితంలోని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఎంతో హృద్యంగా సినిమాలను తెరకెక్కిస్తుంటారీ అక్కడి దర్శకులు. తక్కువ బడ్జెట్‌తో తీసే ఆ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కోట్లాది కలెక్షన్లు కురిపిస్తున్నాయి. 

Parthudu OTT: ఓటీటీలోకి మరో మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా.. ప్రకాశ్‌ రాజ్‌ పార్థుడు స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Parthudu Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 11, 2023 | 6:20 AM

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజ జీవితంలోని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఎంతో హృద్యంగా సినిమాలను తెరకెక్కిస్తుంటారీ అక్కడి దర్శకులు. తక్కువ బడ్జెట్‌తో తీసే ఆ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కోట్లాది కలెక్షన్లు కురిపిస్తున్నాయి.  లవ్‌, కామెడీ, యాక్షన్‌, సస్పెన్స్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌.. ఇలా ఏ జోనరైనా మలయాళ సినిమాలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉన్నారు. ఆమధ్యన రిలీజైన 2018 సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే తాజాగా విడుదలైన నెయ్‌మార్‌ సినిమా కూడా తెలుగు ఓటీటీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఓటీటీలోకి రానుంది. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ నటించిన మలయాళీ పొలిటికల్‌ డ్రామ్‌ ‘వరల్‌’. కన్నన్ తామరైకులం దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనూప్‌ మేనన్‌, సన్నీవేన్‌, సురేష్‌ కృష్ణ, శంకర్‌ రామకృష్ణన్‌, రెంజీపానికర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. టైమ్ యాడ్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై పీఏ సెబాస్టియన్‌ ఈ మూవీని నిర్మించారు. గతేడాది అక్టోబర్‌ 14న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సమకాలీన రాజకీయాలను స్పృశిస్తూ ఎంతో హృద్యంగా వరుల్‌ సినిమాను రూపొందించారు. ఇప్పుడీ సినిమా తెలుగులో రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో పార్థుడు పేరుతో స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ పొలిటికల్‌ డ్రామా మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఈటీవీ విన్‌ ఓటీటీ సంస్థ.

పార్థుడు కథ విషయానికొస్తే..

అచ్యుతన్‌ నాయర్ (ప్రకాశ్‌ రాజ్‌) కేరళ సీఎంగా ఉంటారు. రెండు దఫాల పాటు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన ఆయన.. రానున్న ఎన్నికల కోసం రెడీ అవుతుంటారు. అయితే పార్టీ హై కమాండ్‌ ప్రకాష్‌రాజ్‌ని కాదని డేవిడ్‌ జాన్‌ (అనూప్‌ మేనన్‌)ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుంది. అయితే పెద్ద బిజినెస్‌ మెన్‌ అయిన డేవిడ్‌పై అంతటా వ్యక్తిరేకత వస్తుంది. ఇదే క్రమంలోనే ఆయన అపహరణకు గురవుతారు. ఆ తర్వాత జరిగే పరిణామాలేంటో తెలుసుకోవాలంటే పార్థుడు సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!