Nara Lokesh: చిరంజీవి మాటల్లో తప్పేముంది? మాపై సినిమాలు తీసినప్పుడు విలువలు గుర్తుకు రాలేదా: నారా లోకేష్‌

వాల్తేరు వీరయ్య' 200 రోజుల ఫంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌ సర్కారుపై మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. పిచ్చుక లాంటి సినిమా ఇండస్ట్రీపై బ్రహ్మాస్త్రం ఎందుకుని, ప్రజా సంక్షేమంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడితే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Nara Lokesh: చిరంజీవి  మాటల్లో తప్పేముంది? మాపై సినిమాలు తీసినప్పుడు విలువలు గుర్తుకు రాలేదా: నారా లోకేష్‌
Nara Lokesh, Chiranjeevi
Follow us
Basha Shek

| Edited By: Narender Vaitla

Updated on: Aug 10, 2023 | 6:37 AM

‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల ఫంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌ సర్కారుపై మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. పిచ్చుక లాంటి సినిమా ఇండస్ట్రీపై బ్రహ్మాస్త్రం ఎందుకుని, ప్రజా సంక్షేమంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడితే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిన వారిలో చిరంజీవి కూడా ఒక్కరంటూ ఆయనపై మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు రోజా, కొడాలినాని, అంబటి రాంబాబు, అమర్నాథ్‌, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్‌.. ఇలా వైసీపీ నాయకులు చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్లిస్తున్నారు. మరోవైపు చిరంజీవి కామెంట్స్‌కు మద్దతుగా పలువురు టీడీపీ నాయకులు ముందుకొస్తున్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొత్త పల్లి సుబ్బారాయుడు మెగాస్టార్‌కు మద్దతుగా నిలిచారు. చిరంజీవి అన్నదాంట్లో తప్పేముందంటూ వైసీపీ నాయకులకు కౌంటర్లిచ్చారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. యువగళం పాదయాత్రలో మాట్లాడిన ఆయన మెగాస్టార్‌ చిరంజీవి మద్దతునిస్తూనే వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు.

మాపై సినిమాలు తీయలేదా?..

‘సినిమా పరిశ్రమపై కక్ష కట్టవద్దని చిరంజీవి అనడం తప్పా? సినిమా పరిశ్రమపై రాజకీయాలు చెయ్యొద్దన్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టండి.. సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండన్నారు. ఇందులో తప్పేముందో వైసీపీ నేతలే చెప్పాలి. మరి చంద్రబాబుని, నన్ను, పవన్ కల్యాణ్‌లను విమర్శిస్తూ కట్టు కథలతో సినిమాలు తీసిన రోజు ఈ వైసీపీ నేతలకు విలువలు గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు నారా లోకేష్‌. కాగా చిరంజీవి నటించిన భోళాశంకర్ శుక్రవారం (ఆగస్టు 11)న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఏపీలో టికెట్ల పెంపుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ సర్కార్ టికెట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by GenepoweRx (@genepowerx)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..