Vishal: త్వరలోనే ఓ ఇంటివాడు కానున్న విశాల్.. ఆ హీరోయిన్‌తో ఏడడుగులు వేయనున్న స్టార్ హీరో
సినిమాల సంగతి పక్కన పెడితే తన పెళ్లి వార్తలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు విశాల్. గతంలో హైదరాబాద్ కు చెందిన అనిషా రెడ్డి తో ఎంగేజజ్ మెంట్ చేసుకున్నాడు కూడా. దీంతో విశాల్ పెళ్లి అయిపోయినట్టేనని అనుకున్నారు అభిమానులు. అయితే వివిధ కారణాలతో ఆ పెళ్లి పెటాకులైంది. ఆ తర్వాత కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీతో విశాల్ ప్రేమాయణం నడిపాడని పుకార్లు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ రూమర్లేనని విశాల్, వరలక్ష్మీ ఇద్దరూ..

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు వారికి కూడా ఇతను సుపరిచితమే. తను నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది. అందుకే ఇక్కడ కూడా ఈ యాక్షన్ హీరోకు సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే తన పెళ్లి వార్తలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు విశాల్. గతంలో హైదరాబాద్ కు చెందిన అనిషా రెడ్డి తో ఎంగేజజ్ మెంట్ చేసుకున్నాడు కూడా. దీంతో విశాల్ పెళ్లి అయిపోయినట్టేనని అనుకున్నారు అభిమానులు. అయితే వివిధ కారణాలతో ఆ పెళ్లి పెటాకులైంది. ఆ తర్వాత కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీతో విశాల్ ప్రేమాయణం నడిపాడని పుకార్లు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ రూమర్లేనని విశాల్, వరలక్ష్మీ ఇద్దరూ పెళ్లి వార్తలను కొట్టిపారేశారు. ఇక ఆ మధ్యన ‘శంభో శివ శంభో’ ఫేమ్ నటి అభినయతో విశాల్ వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ నిజం కాదని విశాల్‌తో పాటు అభినయ తేల్చి చెప్పేశారు. తాను ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే శుభవార్త చెబుతానని అప్పట్లో చెప్పుకొచ్చాడు. ఈక్రమంలో విశాల్ పెళ్లి వార్తలు మళ్లీ గుప్పమంటున్నాయి. గతంలో తమిళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన లక్ష్మీ మేనన్‌తో విశాల్ ఏడడుగులు నడవనున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
సుందర్ పాండియన్ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది లక్ష్మీ మేనన్. తన అందం, అభినయంతో కోలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సొంతం చేసుకుంది. . కుమ్కీ (తెలుగులో గజరాజు), జిగర్తాండ, కుట్టిబులి, పాండియనాడు, నాన్ సికపు మన్మన్, కొంబన్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న భోళాశంకర్‌లో కీర్తి సురేష్ పోషించిన పాత్రను తమిళంలో లక్ష్మీనే పోషించడం విశేషం. ఇక విశాల్‌తో కలిసి ‘పాండియనాడు( తెలుగులో పల్నాడు), ‘ఇంద్రుడు’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. ఈ జోడీకి మంచి పేరు కూడా వచ్చింది. అప్పట్లోనే విశాల్, లక్ష్మీ ప్రేమలో ఉన్నారని టాక్ వినిపించింది. అయితే ఆ తర్వాత లక్ష్మీ సినిమాలకు దూరం కావడంతో రూమర్లు ఆగిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఈ హిట్ పెయిర్ పెళ్లి రూమర్లు తెరమీదకొచ్చాయి. మరి ఈసారైనా విశాల్ పెళ్లి వార్తలు నిజమవుతాయా? లేదా రూమర్లుగానే మిగిలిపోతాయా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.




View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..