Actress: ఈ బూరె బుగ్గల బుజ్జాయిని గుర్తుపట్టారా? టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్.. గుడి కూడా కట్టారండోయ్
పై ఫొటోలో ఉన్న క్యూట్‌గా ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడామె సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తెలుగులోనూ బాగా ఫేమస్. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గానే మస్త్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. తెలుగు సినిమాతోనే కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈముద్దుగుమ్మ తన అందం, అభినయంతో క్రేజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది
పై ఫొటోలో ఉన్న క్యూట్‌గా ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడామె సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తెలుగులోనూ బాగా ఫేమస్. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గానే మస్త్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. తెలుగు సినిమాతోనే కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈముద్దుగుమ్మ తన అందం, అభినయంతో క్రేజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈ అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా గుడి కట్టేశారంటే ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. యాపిల్ బ్యూటీగా ఫ్యాన్స్ మదిలో ముద్ర వేసుకున్న ఈ అందాల తార గతేడాది పెళ్లి చేసుకుంది. ఓ వ్యాపారవేత్తతో కలిసి ఏడడుగులు నడిచింది. పెళ్లైనా ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా మరి? ఆమె మరెవరో కాదు.. దేశముదురు హీరోయిన్ హన్సిక. ఇవాళ (ఆగస్టు 9) ఈ సొగసరి పుట్టిన రోజు. అందుకే తన చిన్ననాటి, అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో కూడా అందులోదే.
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన హన్సిక గతేడాది వివాహం చేసుకుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాలు తిరుగుతూ మ్యారీడ్ లైఫ్‌ను బాగానే అస్వాదిస్తోందీ అందాల తార. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ అందాల తార తన వెకేషన్ ఫొటోలన్నింటీనీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. ప్రస్తుతం టర్కీ అందాలను ఆస్వాదిస్తోంది హన్సిక. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాలో చివరిగా కనిపించింది హన్సిక. ఇక గతేడాది మహా అనే లేడీ ఓరియంటెడ్ మూవీతో మెప్పించింది. ప్రస్తుతం పార్ట్‌నర్, 105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శ్రుతి, రౌడీ బేబీ, గార్డియన్, మ్యాన్ తదితర సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..