Ganta SrinivasaRao: అందరివాడైన చిరంజీవే అలా మాట్లాడారంటే రాష్ట్రం ఎలా ఉందో అర్థం చేసుకోండి: మాజీ మంత్రి గంటా
'వాల్తేరు వీరయ్య' 200 రోజుల సెలబ్రేషన్స్ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా, ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, పేదల సంక్షేమంపై దృష్టిపెట్టాలని చిరంజీవి సూచించారు. అయితే చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్లుగా వైసీపీ మంత్రులు, ఎంపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొడాలినాని, అంబటి రాంబాబు, అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్ తదితరులు చిరంజీవిని తప్పుపడుతూ కామెంట్లు చేశారు.

‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల సెలబ్రేషన్స్ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా, ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, పేదల సంక్షేమంపై దృష్టిపెట్టాలని చిరంజీవి సూచించారు. అయితే చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్లుగా వైసీపీ మంత్రులు, ఎంపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొడాలినాని, అంబటి రాంబాబు, అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్ తదితరులు చిరంజీవిని తప్పుపడుతూ కామెంట్లు చేశారు. కాగా చిరంజీవి వ్యాఖ్యలు, అటు వైసీపీ నేతల రియాక్షన్‌పై టీడీపీ నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ వ్యవహారంపై స్పందించారు. చిరంజీవికి మద్దతుగా ట్వీట్ చేసిన ఆయన వైసీపీ మంత్రుల మీడియా సమావేశాలు పెట్టి మరీ మెగాస్టార్‌ను తిట్టడాన్ని గంటా తప్పుపట్టారు. వివాదాలకు దూరంగా ఉండే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇబ్బంది కలిగేలా మాట్లాడారంటే ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు గంటా శ్రీనివాసరావు. ఈ మేరకు చిరంజీవి వ్యాఖ్యలను సమర్థిస్తూ ‘ వీ ఆర్ విత్ యూ మెగాస్టార్’ అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు మాజీ మంత్రి.
అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు..
‘ విమర్శలకు , వివాదాలకు దూరంగా ఉండే అందరివాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయనకు కూడా ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే అర్థం చేసుకోండి. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. చిరంజీవి చెప్పిన దానిలో తప్పేముంది నిజాలే మాట్లాడారు, ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు అంతే కదా. మీరు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టుల గురించి, పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి. అలా కాదని పిచ్చుక పై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి? ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారన్నారు. ఆయన చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా పట్టుమని పది నిముషాలు తమ శాఖలు గురించి మాట్లాడలేని మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఏదేదో ఆయన గురుంచి మాట్లాడటం సరికాదు. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా ఉద్యోగాలు, పేదలపై దృష్టి సారించాలన్న మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలను తెలుగు ప్రజలందరూ సమర్థిస్తున్నారు’ అని ట్వి్ట్టర్‌లో రాసుకొచ్చారు గంటా శ్రీనివాసరావు. ఈ పోస్టుకు WearewithChiru, MegastarChiranjeevi , Chiranjeevi అనే హ్యాష్ ట్యాగ్‌లను జోడించారాయన. మొత్తానికి ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల చుట్టే తిరుగుతున్నాయి.




విమర్శలకు , వివాదాలకు దూరంగా ఉండే అందరివాడు మెగాస్టార్ @KChiruTweets గారు ఆయనకు కూడా ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే అర్థం చేసుకోండి.. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో….
చిరంజీవి గారు చెప్పిన దానిలో తప్పేముంది నిజాలే మాట్లాడారు, ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు అంతే కదా..…
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) August 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




