AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: మరోసారి అదరగోట్టనున్న షెకావత్ సర్‌‌.. పుష్ప2లో ఫహద్ ఫాజిల్ రోల్ ఇలా ఉండనుందా..

అలాగే ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ లో నటించిన ఫహద్ ఫాజిల్  నటన కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 తో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ మూవీ షూటింగ్ సాహారవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే 'పుష్ప 2 ద రూల్' నుంచి ఫహద్ ఫాజిల్ బర్తడే పోస్టర్ విడుదల చేశారుమేకర్స్ అలాగే  భన్వర్ సింగ్ షెకావత్ సర్‌‌ కి పుట్టిన రోజు శభాకాంక్షలు తెలిపారు.

Pushpa 2: మరోసారి అదరగోట్టనున్న షెకావత్ సర్‌‌.. పుష్ప2లో ఫహద్ ఫాజిల్ రోల్ ఇలా ఉండనుందా..
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Aug 09, 2023 | 11:16 AM

Share

పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీలో అల్లు అర్జున్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ లో నటించిన ఫహద్ ఫాజిల్  నటన కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 తో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ మూవీ షూటింగ్ సాహారవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘పుష్ప 2 ద రూల్’ నుంచి ఫహద్ ఫాజిల్ బర్తడే పోస్టర్ విడుదల చేశారుమేకర్స్ అలాగే  భన్వర్ సింగ్ షెకావత్ సర్‌‌ కి పుట్టిన రోజు శభాకాంక్షలు తెలిపారు. ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ఫహద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మలయాళ నటుడే అయినా తెలుగులోనూ ఆయన మంచి గుర్తింపును అందుకున్నారు. ఈరోజు ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘పుష్ప 2 ద రూల్’ నుంచి కొత్త పోస్టర్ తో తనకు బర్త్ డే విషెస్ ను అందజేశారు దర్శక నిర్మాతలు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న ఫహద్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.అలాగే ఈ చిత్రంలో ఫహద్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియజేశారు మేకర్స్. ‘ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోడానికి వస్తున్నాడు’ అంటూ ఫహద్ ఫాజిల్ ఫోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

‘పుష్ప ది రైజ్’ లో అల్లు అర్జున్‌, ఫహద్ మధ్య వచ్చే సీన్ పోటాపోటీగా ఉంటాయట.. ‘పుష్ప-2 దిరూల్’పై అంచనాలు పెంచాయి. ఈమూవీలో ఫహద్ పాత్ర మరింత నెగిటివ్ గా ఉండనుందట. ఆయన సీన్స్ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ గా ఉంటాయని అంటున్నారు. మొన్నామధ్య బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కు వేసాయంటే పులి వచ్చింది అని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చుండాడు అని అని అర్థం అని బన్నీ పాత్రను హైలైట్ చేస్తూ చెప్పిన డైలాగ్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ఆమె పాత్ర ఈ మూవీలో చనిపోతుంది ప్రచారం జరుగుతోంది. అలాగ ఈమూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?