AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: దుమ్మురేపుతోన్న మహేష్ బాబు నయా పోస్టర్.. గుంటూరు కారం టీమ్ స్పెషల్ విషెస్ అదుర్స్

ఈ సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. ఇప్పటికి చాలా మంది ఫెవరెట్ సినిమాలు ఈ రెండు. ఇక ఇప్పుడు గుంటూరు కారం అంటూ అభిమానులను అలరించడానికి రెడీ అయ్యారు ఈ ఇద్దరు. మహేష్  గురూజీ కాంబినేషన్ లో నటిస్తున్న నయా మూవీ గుంటూరు కారం. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గనుంచి సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టైటిల్ తో పాటు ఆ మధ్య గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మహేష్ మాస్ కు ఫ్యాన్ ఫిదా అయిపోయారు.

Guntur Kaaram: దుమ్మురేపుతోన్న మహేష్ బాబు నయా పోస్టర్.. గుంటూరు కారం టీమ్ స్పెషల్ విషెస్ అదుర్స్
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Aug 09, 2023 | 8:48 AM

Share

కొన్ని కాంబినేషన్ ఎప్పుడు ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తూనే ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్ లో మహేష్ బాబు, త్రివిక్రమ్ జోడి ఒకటి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే మాములుగా ఉండదు. గతంలో మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు, ఖలేజా సినిమాలు చేశాడు. ఈ సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. ఇప్పటికి చాలా మంది ఫెవరెట్ సినిమాలు ఈ రెండు. ఇక ఇప్పుడు గుంటూరు కారం అంటూ అభిమానులను అలరించడానికి రెడీ అయ్యారు ఈ ఇద్దరు. మహేష్  గురూజీ కాంబినేషన్ లో నటిస్తున్న నయా మూవీ గుంటూరు కారం. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గనుంచి సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టైటిల్ తో పాటు ఆ మధ్య గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మహేష్ మాస్ కు ఫ్యాన్ ఫిదా అయిపోయారు. చాలా రోజుల తర్వాత మహేష్ మరోసారి మాస్ యాక్షన్ లోకి దిగుతున్నారని అర్ధమవుతుంది.

నేడు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు కారం నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ బాబు లుంగీలో కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పించారు. లుంగీ కట్టుకొని ఓ బల్లపై కూర్చొని బీడీ అంటించుకుంటూ కనిపించారు మహేష్. ఈ పోస్టర్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పోస్టరే దర్శనమిస్తుంది. ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్న ఈ ఫోటోను. బాబు మాస్ యాక్షన్ షురూ అంటున్నారు ఫ్యాన్స్. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. జనవరి 14న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది. శ్రీలీల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. గుంటూరు కారం సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.  మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..