AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rajesh: డాల్ఫీన్‌తో ఆటలాడాలనుకున్న ఐశ్వర్య రాజేష్.. కానీ అది చేసిన పనికి షాక్ అయ్యి షేకయ్యింది

తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో  నటించి మెప్పించింది ఈ చిన్నది. అలాగే తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది.

Aishwarya Rajesh: డాల్ఫీన్‌తో ఆటలాడాలనుకున్న ఐశ్వర్య రాజేష్.. కానీ అది చేసిన పనికి షాక్ అయ్యి షేకయ్యింది
Aishwarya Rajesh
Rajeev Rayala
|

Updated on: Aug 09, 2023 | 7:33 AM

Share

ఐశ్వర్య రాజేష్.. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళ్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో  నటించి మెప్పించింది ఈ చిన్నది. అలాగే తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. మిస్ మ్యాచ్, వరల్డ్ ఫెమమ్స్ లవర్, టాక్ జగదీశ్, రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. గ్లామర్ షో జోలికి పోకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తుంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ వయ్యారి. రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్‌లో ఐశ్వర్య రాజేష్‌కు 3 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య విదేశాల్లో విహరిస్తోంది. మెల్బోర్న్ అక్కడి నుంచి రకరకాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా ఈ ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

డాల్ఫీన్ తో ఆటలాడుతున్న ఫోటోను షేర్ చేసింది ఐశ్వర్య రాజేష్. అయితే ఈ అమ్మడు డాల్ఫీన్ చేసిన పనికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వీడియోలో ముందుగా డాల్ఫీన్ ను ముట్టుకునేందుకు బయపడింది ఐశ్వర్య. ఆతర్వాత దాని మీద నీళ్లు పోస్తూ ఆటలాడింది. ఒక్కసారిగా ఆ డాల్ఫీన్ జర్క్ ఇవ్వడంతో భయపడిపోయింది ఐశ్వర్య రాజేష్. ఆతర్వాత దాంతో డాన్స్ కూడా చేసింది. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తమిళ్, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. రిపబ్లిక్ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు ఐశ్వర్య. అయితే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లకోసం ఎదురుచూస్తుంది. బడా హీరోల సినిమాల్లో నటిస్తే ఈ అమ్మడి కెరీర్ పీక్స్ లో ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!