AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hidimba OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి హిడింబ.. లేటెస్ట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

జులై 20న థియేటర్లలో విడుదలైన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌కు కాస్త పీరియాడికల్‌ టచ్ ఇచ్చిన హిడింబ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌గా నిలిచిన ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా హిడింబ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో గురువారం (ఆగస్టు 10) సాయంత్రం 7 గంటల నుంచి..

Hidimba OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి హిడింబ.. లేటెస్ట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?
Hidimba Movie
Basha Shek
|

Updated on: Aug 10, 2023 | 6:30 AM

Share

యంగ్‌ హీరో అశ్విన్ బాబు నటించిన లేటెస్ట్‌ సినిమా హిడింబ. ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో నందితా శ్వేతా కథానాయిక. అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించి హిడింబ సినిమాకు అనిల్‌ సుంకర సమర్పకుడిగా వ్యవహరించారు. జులై 20న థియేటర్లలో విడుదలైన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌కు కాస్త పీరియాడికల్‌ టచ్ ఇచ్చిన హిడింబ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌గా నిలిచిన ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా హిడింబ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో గురువారం (ఆగస్టు 10) సాయంత్రం 7 గంటల నుంచి అశ్విన్‌ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ ఆహా ఓటీటీ మేకర్స్‌ ‘మాస్క్‌ వెనకున్న మనిషి ఎవరు’ అంటూ ఒక సరికొస్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

హిడింబ సినిమాలో అశ్విన్, నందిత పోలీస్‌ ఆఫీసర్లుగా నటించారు. మకరంద్ దేశ్‌పాండే, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్ రఘు కుంచె,తదితరులు కీలక పాత్రలు పోషించారు. వికాస్ బాడిస బాణీలు అందించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్ లో కొందరు మహిళలు వరుసగా కిడ్నాప్‌కు గురవుతారు. దీని వెనక గల మిస్టరీని ఛేదించేందుకు స్పెషల్‌ ఆఫీసర్‌గా నందిత, అశ్విన్ బాబు రంగంలోకి దిగుతారు. అయితే విచారణలో వారికి ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. హిడింబ అనే ఓ తెగకు చెందిన ఓ క్రూరమైన వ్యక్తి జనారణ్యంలోకి వచ్చాడని తెలుసుకుంటారు. మరి తప్పిపోయిన మహిళలకు హిడింబ తెగకు సంబంధమేమిటి? కిడ్నాప్‌ గుట్టును అశ్విన్‌, నందిత ఛేదించారా? అన్నది తెలుసుకోవాలంటే హిడింబ సినిమాను చూడాల్సిందే. థియేటర్లలో ఈ మూవీని మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఈరోజు ఆహాలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..