Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaddar: నాన్న ఆఖరి కోరిక అదే.. చనిపోయిన తర్వాత సర్కారును ఏమీ అడగొద్దన్నారు.. గద్దర్‌ కుమారుడు ఎమోషనల్‌

గద్దర్‌ ఉద్యమ ప్రస్థానం నుంచి జీవిత చరమాంకం వరకు..ఆయన దేని కోసం తపించారు? ఏ లక్ష్యం కోసం పోరాడారు? అధికార లాంఛనాలతో గద్దర్‌ అంత్యక్రియలు జరగాలని ఎవరు కోరారు? ఒకప్పుడు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా బాధపెట్టిందెవరు? స్వరాష్ట్రంలో గద్దర్‌కు దక్కాల్సిన గౌరవం దక్కలేదా? గద్దర్‌ వారసత్వాన్ని ఆయన పిల్లలు ఎలా ముందుకు తీసుకువెళ్తారు? గద్దర్‌ కుమారుడు సూర్యం, కుమార్తె వెన్నెలతో టీవీ9 ముచ్చటించింది.

Gaddar: నాన్న ఆఖరి కోరిక అదే.. చనిపోయిన తర్వాత సర్కారును ఏమీ అడగొద్దన్నారు.. గద్దర్‌ కుమారుడు ఎమోషనల్‌
Gaddar Son Suryam
Follow us
Basha Shek

|

Updated on: Aug 10, 2023 | 6:10 AM

పొడుస్తున్న పొద్దు మీద ప్రజా ఉద్యమాలను నడిపిన పోరాటాల యోధుడు గద్దర్. ఆయన హఠాన్మరణం పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచింది. గద్దర్‌ ఉద్యమ ప్రస్థానం నుంచి జీవిత చరమాంకం వరకు..ఆయన దేని కోసం తపించారు? ఏ లక్ష్యం కోసం పోరాడారు? అధికార లాంఛనాలతో గద్దర్‌ అంత్యక్రియలు జరగాలని ఎవరు కోరారు? ఒకప్పుడు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా బాధపెట్టిందెవరు? స్వరాష్ట్రంలో గద్దర్‌కు దక్కాల్సిన గౌరవం దక్కలేదా? గద్దర్‌ వారసత్వాన్ని ఆయన పిల్లలు ఎలా ముందుకు తీసుకువెళ్తారు? గద్దర్‌ కుమారుడు సూర్యం, కుమార్తె వెన్నెలతో టీవీ9 ముచ్చటించింది. ‘ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరపాలని తాము కోరనేలేదని, అది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ అని, వాళ్ల కోరికను మన్నించాల్సి వచ్చిందన్నారు గద్దర్‌ కుమారుడు సూర్యం. చివరివరకూ ప్రజాగాయకుడుగా ప్రస్థానాన్ని కొనసాగించారు. కానీ.. రాజకీయ జీవితంపై ఆయన ఉద్దేశాలేంటి అనేది బైటి ప్రపంచానికి తెలీదు. కానీ.. ప్రజా పార్టీ అనేది గద్దర్ చివరి కోరికని సూర్యం పేర్కొన్నారు. ఆ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది ఆయనకున్న బలమైన ఆలోచన న్నారు. అయితే చనిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏమీ అడగొద్దని గద్దరే తమకు చెప్పారన్నారు గద్దర్ కొడుకు సూర్యం, కూతురు వెన్నెల.

కేసీఆర్‌ అవమానించారు..

అలాగే మూడు గంటల పాటు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానపరిచారని, ప్రగతి భవన్ ముందు మూడు గంటల పాటు గద్దర్నీ ఎండలో వెయిట్ చేయించారని, అది ఆయన్నెంతగానో బాధపెట్టిందని చెప్పుకొచ్చారు గద్దర్‌ వారసులు. గాంధీ ఫ్యామిలీతో గద్దర్‌కి అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి, కానీ.. కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజకీయాలు చేయాలన్న ఉద్దేశం ఆయనకు లేదన్నారు. ‘గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం… అతిత్వరలో మా భవిష్యత్ కార్యాచరణ పై ప్రకటన చేస్తాం’ అంటున్నారు గద్దర్ వారసులు. మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన గద్దర్‌కి ప్రభుత్వం నుంచి రావాల్సినంత గౌరవం వచ్చినట్టేనా? మావోయిస్టు పార్టీ నుంచి గద్దర్‌ని ఎందుకు సస్పెండ్ చేశారు? ఇటువంటి సందేహాలకు ఆసక్తికర సమాధానమిచ్చారు సూర్యం, వెన్నెల . దీనికి సంబంధించిన ఫుల్‌ వీడియోను కింద చూడండి.

గద్దర్ కుమారుడు సూర్యం, కుమార్తె వెన్నెలతో టీవీ 9 ఫుల్ ఇంటర్వ్యూ వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..