AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudigali Sudheer- Rashmi: ఎన్నాళ్లకెన్నాళ్లకు! సుధీర్‌ గుండెపై వాలిన రష్మీ.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్‌? అంటూ..

రీల్‌ తెరపై జంటగా నటించే సుధీర్‌- రష్మీ.. రియల్‌ లైఫ్‌లోనూ కపుల్‌గా మారితే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. అంతలా వీరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది. జబర్దస్త్‌ మొదలు వీరి జోడీగా చేసిన పలు ప్రోగ్రామ్స్‌ సూపర్‌హిట్ అయ్యాయి. అయితే కొన్ని రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు సుధీర్‌. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. 'గాలోడు' సినిమాతో హీరోగా మొదటి హిట్‌ అందుకున్న సుధీర్‌ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు

Sudigali Sudheer- Rashmi: ఎన్నాళ్లకెన్నాళ్లకు! సుధీర్‌ గుండెపై వాలిన రష్మీ.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్‌? అంటూ..
Sudigaali Sudheer, Rashmi Gautam
Basha Shek
|

Updated on: Aug 11, 2023 | 6:30 AM

Share

బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌- రష్మీ గౌతమ్‌ జోడీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి జంట స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్‌కు అంతకుమంచిన ఆనందం ఉండదు. రీల్‌ తెరపై జంటగా నటించే సుధీర్‌- రష్మీ.. రియల్‌ లైఫ్‌లోనూ కపుల్‌గా మారితే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. అంతలా వీరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది. జబర్దస్త్‌ మొదలు వీరి జోడీగా చేసిన పలు ప్రోగ్రామ్స్‌ సూపర్‌హిట్ అయ్యాయి. అయితే కొన్ని రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు సుధీర్‌. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ‘గాలోడు’ సినిమాతో హీరోగా మొదటి హిట్‌ అందుకున్న సుధీర్‌ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు. అందుకే బుల్లితెరపై అతను కనిపించి చాలా రోజులైంది. మరోవైపు రష్మీ కూడా అడపా దడపా సినిమల్లో నటిస్తున్నప్పటికీ ఎక్కువగా బుల్లితెరపైనే సందడి చేస్తోంది. దీంతో సుధీర్‌- రష్మీని జంటగా చూసి చాలారోజులైంది. అయితే ఎట్టకేలకు ఈ సూపర్‌ జోడి మళ్లీ కలిసింది.

తాజాగా ఓ ప్రముఖ టీవీ షోలో మళ్లీ జంటగా కనిపించారు సుధీర్‌- రష్మి. దీంతో వారి ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ ప్రోమోలో వీరు కనిపించింది కాసేపైనా తమదైన కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రష్మి గురించి సుధీర్‌ చెప్పిన డైలాగులు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ‘మేడమ్‌ గారు ఎందుకో కోపంగా ఉన్నారు’ అని సుధీర్ అంటే .. ‘నువ్వు వస్తావని ఇన్నాళ్లూ ఎదురుచూశాను’ అని రష్మి బదులిచ్చింది. దీనికి ‘నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గుండెల్లో ఉంటావ్‌’ అంటూ సుధీర్‌ చెప్పడంతో ఒక్కసారిగా స్టేజ్‌ దద్దరిల్లిపోయింది. షోలోని ఇతర కంటెస్టెంట్లు, జనాలు చప్పట్లు, కేకలతో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సుధీర్‌, రష్మి ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అదే సమయంలో వీరి ప్రేమ, పెళ్లి టాపిక్‌ మరోసారి తెరమీదకు వచ్చింది. చిన్న ప్రోమోతోనే అభిమానుల్లో ఉత్సాహం నింపిన సుధీర్‌-రష్మీ జోడి ఫుల్‌ ఎపిసోడ్‌లో ఇంకెంత సందడి చేస్తోరో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

సుధీర్- రష్మీల జోడికి సంబంధించిన ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?