Chiranjeevi: ఎట్టకేలకు.. భోళాకు లైన్‌ క్లియర్‌.! ఆ కేసు కొట్టేసిన కోర్ట్.. వీడియో.

Chiranjeevi: ఎట్టకేలకు.. భోళాకు లైన్‌ క్లియర్‌.! ఆ కేసు కొట్టేసిన కోర్ట్.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 11, 2023 | 9:59 AM

చిరు సినిమాకు లైన్‌ క్లియర్ అయింది. పెద్ద అడ్డు తొలిగిపోయింది. చూస్తుండగానే గండం గడిచిపోయింది. ఎస్ ! మెహర్ రమేష్ డైరెక్షన్లో .. చిరు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్ కు ఓ పెద్ద అడ్డు తొలిగిపోయింది. ఈసినిమాపై సివిల్ కోర్టులో నమోదైన కేసేను .. తాజాగా కోర్టు కొట్టేస్తూ.. తీర్పునిచ్చింది.

చిరు సినిమాకు లైన్‌ క్లియర్ అయింది. పెద్ద అడ్డు తొలిగిపోయింది. చూస్తుండగానే గండం గడిచిపోయింది. ఎస్ ! మెహర్ రమేష్ డైరెక్షన్లో .. చిరు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్ కు ఓ పెద్ద అడ్డు తొలిగిపోయింది. ఈసినిమాపై సివిల్ కోర్టులో నమోదైన కేసేను .. తాజాగా కోర్టు కొట్టేస్తూ.. తీర్పునిచ్చింది. ఇక అసలు విషయం ఏంటంటే..! అజిత్ వేదాళం సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న చిరూ భోళా శంకర్‌ మూవీని.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. అయితే ఇదే ప్రొడక్షన్ పై సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా తెరకెక్కింది. ఇక ఇదే సినిమా డిజాస్టర్‌ టాక్ తెచ్చుకోవడంతో.. ప్రొడ్యూసర్‌తో పాటు.. డిస్ట్రిబ్యూటర్లను తీవ్ర నష్టాల పాలు చేసింది.

అలా అఖిల్ ఏజెంట్ సినిమా కారణంగా నష్టపోయిన గాయత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ బత్తుల సతీష్ రెండు రోజుల క్రితం సిటీ సివిల్ కోర్టుకెళ్లారు. ఏజెంట్ ప్రొడ్యూసర్ తమను మోసం చేశారంటూ.. పిటిషన్ దాఖలు చేశారు. ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ కోసం 30 కోట్లు ఖర్చు పెట్టామని.. పిటిషన్లో కోట్ చేశారు. అందులో నష్టపోయిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేంత వరకు భోళా శంకర్ మూవీ రిలీజ్‌ను వాయిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే తాజాగా గాయత్రి ఫిల్మ్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. దీంతో భోళా శంకర్ మూవీకి ఎలాంటి అడ్డు లేకుండా పోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 11, 2023 12:09 AM