Prabhas: మళ్లీ థియేటర్లలోకి వస్తోన్న ప్రభాస్ ఫ్లాప్ మూవీ.. 4K వెర్షన్ రీ రిలీజ్ ఎప్పుడంటే?
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈనేపథ్యంలో ప్రభాస్ నటించిన 'బిల్లా', 'వర్షం' సినిమాలు మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. ఇప్పుడు ప్రభాస్ నటించిన మరో మూవీ 4కె వెర్షన్‌లో థియేటర్లలో రానుంది. సాధారణంగా హిట్ అయిన సినిమాలు రీ రిలీజ్ చేస్తుంటారు. అయితే ప్రభాస్ కెరీర్‌లో ఫ్లాప్‌గా నిలిచిన..
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియాను మించిన స్టార్. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ దృష్టి కూడా ప్రభాస్‌పై పడింది. బాహుబలి తర్వాత అతను నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నిరాశపర్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈనేపథ్యంలో ప్రభాస్ నటించిన ‘బిల్లా’, ‘వర్షం’ సినిమాలు మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. ఇప్పుడు ప్రభాస్ నటించిన మరో మూవీ 4కె వెర్షన్‌లో థియేటర్లలో రానుంది. సాధారణంగా హిట్ అయిన సినిమాలు రీ రిలీజ్ చేస్తుంటారు. అయితే ప్రభాస్ కెరీర్‌లో ఫ్లాప్‌గా నిలిచిన ‘యోగి’ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కానుండడం ఆశ్చర్యకర విషయం. 2007 జనవరి 14న విడుదలైన ప్రభాస్ నటించిన ‘యోగి’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఈ సినిమా కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘జోగి’కి రీమేక్. కన్నడలో శివరాజ్ కుమార్ చేసిన పాత్రను తెలుగులో ప్రభాస్ చేశాడు. అప్పట్లో ‘యోగి’ సినిమా ఏకంగా 250కి పైగా థియేటర్లలో విడుదలై దాదాపు 13 కోట్లు వసూలు చేసింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘యోగి’ సినిమా మలయాళం, హిందీ, తమిళ భాషల్లో డబ్ చేసినా అక్కడ కూడా ఫ్లాప్‌గానే నిలిచింది.
ఇప్పుడు ఈ ‘యోగి’ సినిమా ఆగస్టు 18న మళ్లీ విడుదల కానుంది. అత్యాధునిక 4కె టెక్నాలజీతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీతో సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నట్టు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ ప్రకటించింది. కొన్ని నెలల క్రితం రీరిలీజ్ అయిన ప్రభాస్ ‘బిల్లా’, ‘వర్షం’ సినిమాలు మంచి వసూళ్లను సాధించాయి. దాంతో ‘యోగి’ సినిమా కూడా భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నయనతార కథానాయికగా నటించింది. కోట శ్రీనివాస్ రావు, అల్లి, సుబ్బురాజ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మరి యోగి సినిమా ఈసారి ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.
60% Tickets sold out in #sudharshan35mm for #Yogi Book fast for Your tickets 💥#Prabhas 🔥 pic.twitter.com/3GQvqj01iq
— 🅺🅰🅸🅻🅰🆂🅷 (@KailashPrabhas_) August 10, 2023
lets celebrate the most celebrated song ever in 4K once again💥#Prabhas #Yogi pic.twitter.com/LYgNjehQwe
— Prabhas Cuts (@PrabhasHDCuts) August 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..