AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandramukhi: ‘చంద్రముఖి’లో సినిమాలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా? ఇప్పుడెంత అందంగా ఉందో చూశారా?

చంద్రముఖి సినిమాలో అత్తింధోం.. పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇందులో రజనీకాంత్‌తో పాటు ఓ చిన్నారి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. చంద్రముఖి 2 రిలీజవుతున్న క్రమంలో ఆ చిన్నారిని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడెలా ఉందో అంటూ గూగుల్‌ తల్లిని ఆశ్రయిస్తున్నారు. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్‌తో కలిసి సందడి చేసిన ఆ చిన్నారి పేరు ప్రహర్షిత శ్రీనివాసన్‌. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు, సీరియల్స్‌లో నటించి మెప్పించింది.

Chandramukhi: 'చంద్రముఖి'లో సినిమాలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా? ఇప్పుడెంత అందంగా ఉందో చూశారా?
Chandramukhi Child Artist
Basha Shek
|

Updated on: Aug 12, 2023 | 6:00 AM

Share

సూపర్‌ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్‌ ఉన్నాయి. అయితే చంద్రముఖి సినిమా మాత్రం ఆయన కెరీర్‌లోనే ఒక ప్రత్యేకం. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ టీవీల్లో ఈ మూవీ వస్తే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. పి.వాసు దర్శకత్వం వహించిన చంద్రముఖి సినిమాలో రజనీతో పాటు జ్యోతిక, నయనతార, ప్రభు, నాజర్, వడివేలు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా చంద్రముఖి 2 కూడా రిలీజ్‌ కానుంది. లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా చంద్రముఖి సినిమాలో అత్తింధోం.. పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇందులో రజనీకాంత్‌తో పాటు ఓ చిన్నారి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. చంద్రముఖి 2 రిలీజవుతున్న క్రమంలో ఆ చిన్నారిని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడెలా ఉందో అంటూ గూగుల్‌ తల్లిని ఆశ్రయిస్తున్నారు. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్‌తో కలిసి సందడి చేసిన ఆ చిన్నారి పేరు ప్రహర్షిత శ్రీనివాసన్‌. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు, సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అయితే చంద్రముఖి తర్వాత పెద్దగా సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించలేదు.

త్వరలోనే రీ ఎంట్రీ..

కాగా ప్రహర్షిత 2021లో వివాహం చేసుకుంది. గతేడాది ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. సుమారు 18 ఏళ్లపాటు నటనకు దూరంగా ఉన్న ప్రహర్షిత ఇప్పుడు ఓ తమిళ్‌ సీరియల్‌లో నటిస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుది ప్రహర్షిత. తన లేటెస్ట్‌ ఫొటోషూట్స్‌, భర్త, కూతురితో దిగిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది. ఇవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా ఆమె చంద్రముఖి సినిమాలో చిన్నప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడెలా మారిపోయానో తెలియజేస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో ఎంతో అందంగా కనిపిస్తోంది ప్రహర్షిత. హీరోయిన్‌గా ట్రై చేయవచ్చు కదా? అని నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. కాగా చంద్రముఖి 2 సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 19న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

ప్రహర్షిత శ్రీనివాసన్‌ లేటెస్ట్‌ ఫొటోస్‌, వీడియోస్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు