Rashmika Mandanna: డిసెంబర్ నెల తనకు అదృష్టమంటున్న రష్మిక.. ఎందుకో తెలుసా ?..

హిందీలో 'మిషన్ మజ్ను' సినిమాతో నటిగా మరోసారి ప్రశంసలు అందుకుంది.. ప్రస్తుతం యానిమల్ సినిమాలో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తుండగా.. సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. రష్మిక పాత్ర గురించి చిత్ర బృందం మరింత సమాచారం వెల్లడించలేదు. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా విడుద‌ల కానుండ‌డం విశేషం. అయితే ఆ నెల తనకు అదృష్టమని రష్మిక పేర్కొంది .

Rashmika Mandanna: డిసెంబర్ నెల తనకు అదృష్టమంటున్న రష్మిక.. ఎందుకో తెలుసా ?..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 12, 2023 | 12:45 AM

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకీ మరింత పెరుగుతుంది. సౌత్ టూ నార్త్ వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రష్మిక. ఈ ఏడాది ప్రారంభంలో ‘వరిసు’ సూపర్ హిట్ అందుకుంది. హిందీలో ‘మిషన్ మజ్ను’ సినిమాతో నటిగా మరోసారి ప్రశంసలు అందుకుంది.. ప్రస్తుతం యానిమల్ సినిమాలో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తుండగా.. సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. రష్మిక పాత్ర గురించి చిత్ర బృందం మరింత సమాచారం వెల్లడించలేదు. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా విడుద‌ల కానుండ‌డం విశేషం. అయితే ఆ నెల తనకు అదృష్టమని రష్మిక పేర్కొంది .

రష్మిక మందన్న ‘కిరిక్ పార్టీ’ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఈ చిత్రం డిసెంబర్ (2016) కన్నడలో విడుదలైంది. సూపర్ హిట్ చిత్రం ‘పుష్ప’ కూడా డిసెంబర్ (2021)లో విడుదలైంది. ఈ రెండు సినిమాలు రష్మిక కెరీర్‌లో కీలకంగా మారాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు డిసెంబర్‌లో విడుదల కానున్నాయి. ఇప్పుడు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘యానిమల్’ కూడా ఈ సందర్భంగా విడుదలవుతోంది. ఇటీవల ఈటైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ, ‘డిసెంబర్ నాకు ఎప్పుడూ అదృష్ట నెల. కిరిక్ పార్టీ, చమక్, అంజనీపుత్ర సహా పలు చిత్రాలు ఈ నెలలో విడుదలయ్యాయి. ఈ నెలలో విడుదలైన చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. నా ఐదవ సినిమా యానిమల్ డిసెంబర్‌లో విడుదల కానుంది. నేను థ్రిల్‌గా ఉన్నాను’ అని తెలిపింది.

యానిమల్ సినిమాకి, నా పాత్రకి ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నాను. అది నాకు కష్టమైన పాత్ర. ఇలాంటి పాత్ర చేస్తానని అనుకోలేదు’ అని అన్నారు. రష్మిక ‘పుష్ప 2’తో బిజీగా ఉంది. దీంతో పాటు ‘రెయిన్‌బో’ వంటి సినిమా పనుల్లో కూడా బిజీగా ఉంది.. ఇటీవలే డేట్స్ కుదరకపోవడంతో నితిన్ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.