Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi Birthday: ‘సన్నని వాగు మహానదిగా మారినట్లు’.. చిరంజీవికి పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే విషెస్‌

ఆగస్టు 22.. మెగాభిమానులకు ఈ తేదీ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజునే మెగాస్టార్‌ చిరంజీవి ఈ భూమ్మీదకు అడుగుపెట్టారు. స్వయంకృషితో ఎదిగి సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది యువ హీరోలకు ఆయన స్ఫూర్తి దాయకం. ఇదిలా ఉంటే మరికొన్ని గంటల్లో మెగాస్టార్‌ చిరంజీవి 68వ పడిలో అడుగుపెడుతున్నారు.

Chiranjeevi Birthday: 'సన్నని వాగు మహానదిగా మారినట్లు'.. చిరంజీవికి పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే విషెస్‌
Chiranjeevi, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2023 | 10:04 PM

ఆగస్టు 22.. మెగాభిమానులకు ఈ తేదీ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజునే మెగాస్టార్‌ చిరంజీవి ఈ భూమ్మీదకు అడుగుపెట్టారు. స్వయంకృషితో ఎదిగి సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది యువ హీరోలకు ఆయన స్ఫూర్తి దాయకం. ఇదిలా ఉంటే మరికొన్ని గంటల్లో మెగాస్టార్‌ చిరంజీవి 68వ పడిలో అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్నయ్య పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు పలువురు సినిమా తారలు కూడా ముందుగానే మెగాస్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోదరుడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అన్నయ్యకు ముందస్తు పుట్టిన రోజు విషెస్‌ తెలియజేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌.

సన్నని వాగులా మొదలై మహానదిగా..

‘అన్నయ్య చిరంజీవికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.  హ్యాపీ బర్త్ డే అన్నయ్యా ..!’ అంటూ  ఎమోషనల్ గా రాసుకొచ్చారు పవన్‌ కల్యాణ్‌.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్

చిరంజీవి ఫ్యామిలీ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.