Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: దటీజ్‌ మెగాస్టార్‌.. చిరంజీవి గొప్పతనం గురించి ఉత్తేజ్‌ కూతురు ఏమందో తెలుసా?

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ కూతురు చిరంజీవి గురించి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. చిరంజీవి, ఉత్తేజ్‌ల మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్‌ను అన్నయ్య అని పిలిచే కోట్లాది మందిలో ఉత్తేజ్‌ కూడా ఒకరు. ఇక ఉత్తేజ్ సతీమణి మరణించినప్పుడు ఆయన చిరంజీవిని పట్టుకోని భోరున విలపించడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

Megastar Chiranjeevi: దటీజ్‌ మెగాస్టార్‌.. చిరంజీవి గొప్పతనం గురించి ఉత్తేజ్‌ కూతురు ఏమందో తెలుసా?
Chiranjeevi, Uttej Daughter
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2023 | 8:05 PM

మెగాస్టార్‌ చిరంజీవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలోనే ఈ పేరుకు చాలా ప్రత్యేకత ఉంది. ఎలాంటి గాడ్‌ఫాదర్‌ అండ లేకుండా స్వయంశక్తితో ఎదిగిన చాలా తక్కువ మంది హీరోల్లో చిరంజీవి ఒకరు. అందుకే యువ హీరోలు సైతం అన్నయ్యనే స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు. చిరంజీవి నటించిన లేటెస్ట్‌ సినిమా భోళాశంకర్‌ ఫ్లాప్‌ అయిందని, ఆయన విరామం తీసుకుంటే మంచిదని కొందరు అదే పనిగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. వీటిని చూసి అన్నయ్య అభిమానులనే కాదు కార్తికేయ లాంటి యంగ్‌ హీరోలు సైతం బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి చూడని సక్సెస్‌, ఫెయిల్యూర్స్ లేవు. త్వరలోనే మళ్లీ ఆయన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో మన ముందుకు వస్తారు’ అంటూ చిరంజీవి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ కూతురు చిరంజీవి గురించి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. చిరంజీవి, ఉత్తేజ్‌ల మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్‌ను అన్నయ్య అని పిలిచే కోట్లాది మందిలో ఉత్తేజ్‌ కూడా ఒకరు. ఇక ఉత్తేజ్ సతీమణి మరణించినప్పుడు ఆయన చిరంజీవిని పట్టుకోని భోరున విలపించడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

పెదనాన్నే స్వయంగా వడ్డించారు..

ఈ క్రమంలోనే తన పుట్టిన రోజున చిరంజీవిని కలిసినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో వెల్లడించింది ఉత్తేజ్‌ కూతురు పాట ఉత్తేజ్‌. చిరంజీవితో కలిసున్న ఫొటోలను షేర్‌ చేసిన ఆమె ‘ నేను ఎంతో అదృష్టవంతురాలిని.. లవ్యూ సో మచ్ పెదనాన్న.. నా జీవితంలో ఇంతకంటే గొప్ప గిప్ట్‌ను ఎవ్వరూ ఇవ్వలేరు. పెదనాన్నతో ఎంతో విలువైన సమయాన్ని గడిపాను. ఆయన ఎంతో మంచివారు. స్వీటెస్ట్ పర్సన్. ఆయనే నాకు స్వయంగా భోజనం వడ్డించారంటే నమ్మలేకపోతోన్నా. ఇలా మళ్లీ భోళా శంకర్‌ సెట్‌లో బాస్‌ను కలవడం ఆనందంగా ఉంది’ అని తన పోస్టులో రాసుకొచ్చింది పాట ఉత్తేజ్‌. అయితే ఉత్తేజ్‌ కూతురు పుట్టిన రోజు ఎప్పుడో అయిపోయింది. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు పోస్ట్‌ చేయడం గమనార్హం. ఇక భోళా శంకర్‌ సినిమాలో ఉత్తేజ్‌ కూడా ఓ పాత్రలో కనిపించారు. అప్పుడే తన కూతురును సినిమా సెట్‌కు తీసుకెళ్లి ఉంటారని తెలుస్తోంది. ఏదైతేనెం.. ఉత్తేజ్‌ కూతురు షేర్‌ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పెదనాన్న అంటూ ఆమె చెప్పిన మాటలు మెగాభిమానులు గుర్తుచేస్తూ ‘దటీజ్‌ మెగాస్టార్‌ ‘ అంటూ తమ హీరోపై అభిమానం చాటుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఉత్తేజ్ కూతురు ఎమోషనల్ పోస్ట్

ఉత్తేజ్ కూతురు లేటెస్ట్ ఇన్ స్టా ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.