Renu Desai: అకిరా సినీ ఎంట్రీపై స్పందించిన రేణు దేశాయ్‌.. రాఘవేంద్రరావుతో కుమారుడి ఫొటోపై ఏమన్నారంటే?

టాలీవుడ్ విషయానికొస్తే.. మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీ నుంచి అరడజనకు పైగా హీరోలు హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మరో హీరో రానున్నాడనే వార్తలు గత కొన్ని రోజులుగా హల్‌ చల్‌ చేస్తున్నాయి. అతను మరెవరో కాదు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కుమారుడైన అకీరా సినిమాల్లోకి రానున్నడాడనే ప్రచారం గత కొన్ని నెలలుగా సాగుతోంది.

Renu Desai: అకిరా సినీ ఎంట్రీపై స్పందించిన రేణు దేశాయ్‌.. రాఘవేంద్రరావుతో కుమారుడి ఫొటోపై ఏమన్నారంటే?
Renu Desai, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Aug 22, 2023 | 9:03 PM

స్టార్ నటీనటుల పిల్లలు సినిమా రంగంలోకి రావడం కొత్తేమీ కాదు. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌, శాండల్‌వుడ్.. ఇలా అన్ని సినిమా ఇండస్ట్రీలో ఈ ట్రెండ్‌ కొనసాగుతోంది. టాలీవుడ్ విషయానికొస్తే.. మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీ నుంచి అరడజనకు పైగా హీరోలు హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మరో హీరో రానున్నాడనే వార్తలు గత కొన్ని రోజులుగా హల్‌ చల్‌ చేస్తున్నాయి. అతను మరెవరో కాదు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కుమారుడైన అకీరా సినిమాల్లోకి రానున్నడాడనే ప్రచారం గత కొన్ని నెలలుగా సాగుతోంది. అయితే తల్లి రేణదేశాయ్‌ మాత్రం ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తూ వస్తోంది. అకీరాకు ఇప్పట్లో నటించే ఆసక్తిలేదంటూ ఈ పుకార్లను కొట్టిపారేస్తోంది. ఇప్పుడు మళ్లీ అకీరా సినీ ఎంట్రీపై హల్‌చల్‌ వస్తున్నాయి. దీనికి కారణం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు షేర్‌ చేసిన లేటెస్ట్‌ ఫొటో. తన మనవడు కార్తికేయ, అకీరా నందన్‌తో కలిసి ఫొటోలు దిగిన రాఘవేంద్రరావు ‘నాలుగో తరం అబ్బాయిలతో రాఘవేంద్రరావు. నా మనవడు కార్తికేయ, పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌.. ఇద్దరూ అమెరికాలోని ఫిల్మ్‌ స్కూల్లో చేరారు’అని చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్వీట్‌ చేసిన కొద్ది సేపటికే తొలగించారాయన. అయితే అప్పటికే ఫొటో నెట్టింట బాగా వైరలైంది. ముఖ్యంగా మెగాభిమానులు ఈ ఫొటోను చూసి మురిసిపోయారు. త్వరలోనే పవన్‌ కుమారుడిని సిల్వర్‌ స్క్రీన్‌పై చూడనున్నామంటూ నెట్టింట తెగ సందడి చేశారు.

ఇక అకీరా విషయం రేణు దేశాయ్ దృష్టి దాకా వెళ్లింది. తన కుమారుడి సిని ఎంట్రీపై ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చారు. ‘ప్రస్తుతం అకీరాకు నటనపై ఆసక్తి లేదు. హీరో కావాలని అనుకోవడం లేదు. భవిష్యత్తును ఇప్పుడే ఊహించలేం. నేను ఏదైనా పోస్ట్ చేస్తే దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఊహాగానాలు ఆపేయండి. ఒకవేళ అకీరా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే.. ఆ విషయాన్ని నేను మీతో కచ్చితంగా పంచుకుంటాను’ అని రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చారు. అలాగే రాఘవేంద్రరావుతో తాను దిగిన ఫొటోను కూడా ఆమె నెట్టింట షేర్‌ చేసుకున్నారు. దీంతో అకీరా ఎంట్రీపై వస్తోన్న పుకార్లకు మరోసారి తెరదించింది రేణూ దేశాయ్‌.

ఇవి కూడా చదవండి

రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కల్యాణ్‌ తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన ‘బ్రో’ చిత్రం విడుదలైంది. సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించారు. దీపి తర్వాత’ఓజీ’, ‘హరి హర వీర మల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల్లో నటిస్తున్నాడు పవన్‌.

కుమారుడు, కూతురు, పవన్ కల్యాణ్ లతో రేణు దేశాయ్

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు