Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పట్లో నవ్వించా.. ఇప్పుడు భయపెడతానంటోన్న టాలీవుడ్‌ సీనియర్‌ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

ఇప్పటికీ చాలామంది థియేటర్లలో సినిమాలు చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నా ఓటీటీల హవా మాత్రం తగ్గడం లేదు. అందుకే పలువురు స్టార్‌ హీరోలు కూడా డిజిటల్ బాట పడుతున్నారు. వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్‌ హీరోలు కూడా వెబ్‌ సిరీసుల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో హీరో ఓటీటీ బాట పట్టాడు. ఓ ఆసక్తికరమైన థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌తో రానున్నట్లు తెలిపాడు.

Tollywood: అప్పట్లో నవ్వించా.. ఇప్పుడు భయపెడతానంటోన్న టాలీవుడ్‌ సీనియర్‌ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Hero
Follow us
Basha Shek

|

Updated on: Aug 22, 2023 | 8:30 PM

ప్రస్తుతం థియేటర్‌ సినిమాలతో పాటు ఓటీటీలకు క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. కరోనా కాలంలో మొదలైన వీటి ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. ఇప్పటికీ చాలామంది థియేటర్లలో సినిమాలు చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నా ఓటీటీల హవా మాత్రం తగ్గడం లేదు. అందుకే పలువురు స్టార్‌ హీరోలు కూడా డిజిటల్ బాట పడుతున్నారు. వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్‌ హీరోలు కూడా వెబ్‌ సిరీసుల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో హీరో ఓటీటీ బాట పట్టాడు. ఓ ఆసక్తికరమైన థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌తో రానున్నట్లు తెలిపాడు. పనిలో పనిగా ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశాడు. ఇందులో ముఖం నిండా రక్తపు గాయాలతో ఎంతో భయానకంగా కనిపించాడీ హీరో. ఇంతకీ అతనెవరో గుర్తుపట్టారా? గతంలో కామెడీ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచాడీ హీరో. సూపర్‌ డూపర్‌ హిట్లు సొంతం చేసుకున్నాడు. అయితే ఏమైందో తెలియదు కానీ సడెన్‌గా సినిమాలకు దూరమై పోయాడు. మధ్యలో ఒకటి, రెండు సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌తో సందడి చేసినా కంటిన్యూ చేయలేకపోయాడు. కొన్ని నెలల క్రితం మాస్‌ మహారాజా రవితేజ నటించిన ఓ సినిమాలోనూ పోలీసాఫీసర్‌గా నెగెటివ్‌ రోల్‌లో కనిపించాడు. అయినా హిట్‌ కొట్టలేకపోయాడు. అందుకే ఏకంగా ఓటీటీ బాట పట్టాడు. ఎలాగైనా హిట్‌ కొట్టాలనే లక్ష్యంతో ఓ హార్రర్‌, థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చాడు. మరి పై పోస్టర్‌లో ముఖం నిండా గాయాలతో కనిపిస్తోన్న హీరోను గుర్తుపట్టారా? కనిపెట్టకపోయినా నో ప్రాబ్లమ్‌.. ఆన్సర్‌ కూడా మేమే చెబుతాం లెండి. అతను మరెవరో కాదు.. వేణు తొట్టెంపూడి

స్వయం వరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వేణు. ఆతర్వాత చిరునవ్వుతో, హనుమాన్‌ జంక్షన్‌, కల్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, పెళ్లాంతో పనేంటి, చెప్పవే చిరుగాలి, ఖుషి ఖుషిగా, అల్లరే అల్లరి, యమగోల మళ్లీ మొదలైంది, గోపి గోపిక గోదావరి తదితర హిట్‌ సినిమాల్లో నటించాడు. అయితే ఎందుకనో సడెన్‌గా సినిమాలకు దూరమయ్యాడు. చింతకాలయ రవి, దమ్ము సినిమాల్లో క్యామియో రోల్స్‌లో కనిపించినా హిట్ కొట్టలేకపోయాడు. చివరిగా రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో నెగెటివ్‌ రోల్‌లో నటించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు అతిథి అనే ఓ థ్రిల్లర్‌ సిరీస్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించడానికి వస్తున్నాడు. తాజాగా రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో అతిథి వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

అతిథి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..