Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Slum Dog Husband: ఓటీటీలోకి వచ్చేస్తోన్న లేటేస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా.. ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

పిట్టకథ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇటీవలే స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యూడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించగా.. తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించింది.

Slum Dog Husband: ఓటీటీలోకి వచ్చేస్తోన్న లేటేస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా.. 'స్లమ్ డాగ్ హస్బెండ్' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Slum Dog Husband
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 23, 2023 | 6:48 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ అంటే తెలియనివారుండరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అనేక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన వారసుడు సంజయ్ రావు చిత్రపరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నారు. పిట్టకథ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇటీవలే స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యూడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించగా.. తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించింది. బాలనటిగా తెలుగులో పలు సినిమాలు చేసిన ప్రణవి.. ఆ తర్వాత బుల్లితెరపై సీరియల్స్ లో లీడ్ రోల్ పోషించింది. ఇక ఇటీవలే స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాతో కథానాయికగా అడుగుపెట్టింది.

ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. జూలై 29న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినీప్రియులను కడుపుబ్బా నవ్వించింది. అయితే ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 24న స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కామెడీ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో సునీల్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి, యాదమ్మ రాజు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. దోషం ఉన్న అబ్బాయి పెళ్లికి ముందుకు కుక్కను వివాహం చేసుకోవాల్సి రావడం.. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది కథ. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యింది.

ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైన ప్రణవి మానుకొండ.. ముందుగా బాలనటిగా పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి మెప్పించింది. స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.