AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌లోకి వెళ్తే విడాకులిస్తా.. భర్తకు వార్నింగ్‌ ఇచ్చిన సీనియర్‌ డైరెక్టర్‌ కూతురు

యాక్టర్‌ రవి శివ తేజ.. యూట్యూబ్‌లో షార్ట్స్‌ ఫిల్మ్స్‌ బాగా చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టిన సూర్య వెబ్ సిరీస్‌లో షణ్ముఖ్‌ జస్వంత్‌ స్నేహుతుడిగా ఆకట్టుకున్న అతను 400కు పైగా షార్ట్స్‌ ఫిల్మ్స్‌లో నటించాడు. తనదైన కామెడీ పంచులు, ప్రాసలతో అందరినీ అలరిస్తున్నాడు. ఈ మధ్యన 'నేను స్టూడెంట్‌ సర్‌', 'ఉస్తాద్‌' సినిమాల్లోనూ మెరిశాడు. ఈ సంగతి పక్కన పెడితే రవి శివతేజ ఓ స్టార్‌ డైరెక్టర్‌ అల్లుడని చాలామందికి తెలియదు. ఆయన మరెవరో కాదు.. గతంలో

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌లోకి వెళ్తే విడాకులిస్తా.. భర్తకు వార్నింగ్‌ ఇచ్చిన సీనియర్‌ డైరెక్టర్‌ కూతురు
Actor Ravi Shiva Teja Family
Follow us
Basha Shek

|

Updated on: Aug 22, 2023 | 5:40 PM

యాక్టర్‌ రవి శివ తేజ.. యూట్యూబ్‌లో షార్ట్స్‌ ఫిల్మ్స్‌ బాగా చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టిన సూర్య వెబ్ సిరీస్‌లో షణ్ముఖ్‌ జస్వంత్‌ స్నేహుతుడిగా ఆకట్టుకున్న అతను 400కు పైగా షార్ట్స్‌ ఫిల్మ్స్‌లో నటించాడు. తనదైన కామెడీ పంచులు, ప్రాసలతో అందరినీ అలరిస్తున్నాడు. ఈ మధ్యన ‘నేను స్టూడెంట్‌ సర్‌’, ‘ఉస్తాద్‌’ సినిమాల్లోనూ మెరిశాడు. ఈ సంగతి పక్కన పెడితే రవి శివతేజ ఓ స్టార్‌ డైరెక్టర్‌ అల్లుడని చాలామందికి తెలియదు. ఆయన మరెవరో కాదు.. గతంలో స్వయంవరం, నువ్వే కావాలి, మన్మథుడు, నువ్వునాకు నచ్చావ్‌, మల్లీశ్వరి వంటి హిట్‌ సినిమాలు తెరకెక్కించిన కే. విజయ్‌ భాస్కర్‌. తెలుగులో వందలాది షార్ట్స్‌ ఫిల్మ్స్‌లో నటించి మెప్పించిన రవి శివతేజ విజయ్‌ భాస్కర్‌ కూతురు శ్యామలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఉస్తాద్‌ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఈ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌ తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే బిగ్‌బాస్‌ రియాలిటీ షో గురించి కూడా మాట్లాడాడు.

అదృష్టం కలిసొచ్చింది. .

‘నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడేవాడిని. నేను కష్టాల్లో ఉన్నప్పుడు శ్యామల తోడుగా నిలిచింది. అయితే మా మధ్య ప్రేమ మొదలయ్యే నాటికి ఆమె డైరెక్టర్‌ విజయ భాస్కర్‌ కూతురని కూడా నాకు తెలియదు. కొద్దిరోజుల తర్వాత అసలు విషయం తెలిశాక మా పెళ్లి జరుగుతుందా లేదా అనే భయం పట్టుకుంది. అయితే మాకు పెళ్లి అయిందంటే అందుకు ప్రధాన కారణం శ్యామలనే. ఎన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చినా కుటుంబ సభ్యలను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంది. ఆమె నా జీవితంలోకి రావడం ఎంతో అదృష్టం’ అని తన సతీమణిపై ప్రేమను కురిపించాడు రవి శివతేజ. ఇక బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై స్పందిస్తూ ‘ బిగ్‌బాస్‌లోకి వెళ్తే నాకు విడాకులు ఇస్తానంది మా ఆవిడ (నవ్వుతూ). ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి నాకు కూడా ఈ షోకు వెళ్లాలనే ఆలోచన లేదు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ విజయ భాస్కర్ కూతురు శ్యామలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రవి శివతేజ..

Vijay Bhaskar, Ravi Shiva Teja

Vijay Bhaskar, Ravi Shiva Teja

రవి శివతేజ, శ్యామల దంపతుల ఫొటోస్

View this post on Instagram

A post shared by K.SYAMANI (@syamani9)

View this post on Instagram

A post shared by K.SYAMANI (@syamani9)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.