AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3: భారత్‌కు అభినందనలు.. మేం సిగ్గుతో తల దించుకుంటున్నాం.. చంద్రయాన్‌ 3 సక్సెస్‌పై పాక్‌ నటి

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశమంతా సంబరాలు జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు సామాన్యుల వరకు ఇస్త్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నారు. చంద్రయాన్‌ 3 ప్రయోగం 140 కోట్ల మంది కలల్ని, ఆశయాలను నిజం చేసిందని, ఇది తమకెంతో గర్వకారణమంటూ ఉప్పొంగిపోతున్నారు. ఈ గ'ఘన' విజయాన్ని తరతరాలు గుర్తించుకుంటాయని..

Chandrayaan 3: భారత్‌కు అభినందనలు.. మేం సిగ్గుతో తల దించుకుంటున్నాం.. చంద్రయాన్‌ 3 సక్సెస్‌పై పాక్‌ నటి
Chandrayaan 3,Sehar Shinwari
Basha Shek
|

Updated on: Aug 23, 2023 | 9:42 PM

Share

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశమంతా సంబరాలు జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు సామాన్యుల వరకు ఇస్త్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నారు. చంద్రయాన్‌ 3 ప్రయోగం 140 కోట్ల మంది కలల్ని, ఆశయాలను నిజం చేసిందని, ఇది తమకెంతో గర్వకారణమంటూ ఉప్పొంగిపోతున్నారు. ఈ గ’ఘన’ విజయాన్ని తరతరాలు గుర్తించుకుంటాయని, ఇందుకు కారణమైన ఇస్రో శాస్త్రవేత్తలకు కంగ్రాట్స్‌ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు షేర్‌ చేస్తున్నారు. కాగా చంద్రయాన్‌ 3 విజయాన్ని పురస్కరించుకుని ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాల అధిపతులు, అధ్యక్షులు భారత్‌కు, ఇస్రోకు అభినందనలు తెలుపుతున్నారు. ఈక్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నటి సెహర్‌ షిన్వారీ కూడా చంద్రయాన్‌ 3 సక్సెస్‌ పై స్పందించింది. సోషల్‌ మీడియా వేదికగా భారత్‌కు అభినందనలు తెలిపింది. ‘భారత్‌లో శత్రుత్వాన్ని పక్కన పెడితే ఇస్రోను అభినందించాల్సిందే. సైన్స్ అండ్‌ టెక్నాలజీ పరంగా భారత్ ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఈ ఘనతను అందుకోవడానికి పాకిస్తాన్‌కు మరో 2,3 దశాబ్దాలు పడుతుంది. భారత్‌ ఎంత ఎత్తుకు ఎదిగిందో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. దురదృష్టవశాత్తు ఈ రోజు మన దుస్థితికి మనం తప్ప మరెవరూ కాదు. అన్న విషయాన్ని పాకిస్తాన్ ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి’ అని పాక్‌ నటి సొంత దేశంపైనే సెటైర్లు వేసింది.

 చంద్రయాన్ 3 సక్సెస్ పై పాకిస్తాన్ నటి పోస్ట్

కాగా సెహ‌ర్ షిన్వారీ నెటిజన్లకు బాగా పరిచయస్తురాలే. ముఖ్యంగా క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఈ అందాల తార గురించి తెలిసే ఉంటుంది. గతేడాది భారత్‌, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ను ఉద్దేశిస్తూ షిన్వారీ చేసిన పోస్ట్‌ అప్పట్లో పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే కనుక భారత జట్టును ఓడిస్తే..ఆ దేశ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటూ ట్వీట్‌ చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింద. దీంతో కొన్నాళ్లు కనిపించకుండా పోయింది. ఇక ఆ మధ్యన పాక్‌ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అయినప్పుడు ప్రధానమంత్రి మోడీని అరెస్ట్‌ చేయాంటూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌ను కోర వార్తల్లో నిలిచింది. ఇలా పలుసార్లు భారత్‌కు వ్యతిరేకంగా పోస్టులు చేసింది షెన్వారీ. అయితే చంద్రయాన్‌ 3 సక్సెస్‌ నేపథ్యంలో తొలిసారిగా భారత్‌కు అనుకూలంగా కామెంట్స్‌ చేసింది. అదే సమయంలో సొంత దేశంపై సెటైర్లు వేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!