- Telugu News Photo Gallery Cinema photos Amala Paul without makeup photos are going viral on social media
Amala Paul: నేచురల్ లుక్‌లో మెరిసిన అమలాపాల్.. ఫిదా అవుతున్న నెటిజన్స్
ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది. లవ్ ఫెయిల్యూర్ సినిమా సక్సెస్ అవ్వడంతో ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. దాదాపు కుర్రహీరోలందరితో కలిసి సినిమాలు చేసింది ఈ చిన్నది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది ఈ చిన్నది. ముఖ్యంగా ఆమె అనే సినిమాలో న్యూడ్ గా నటించి అందరిని అవాక్ అయ్యేలా చేసింది అమలాపాల్.
Rajeev Rayala | Edited By: Ravi Kiran
Updated on: Aug 23, 2023 | 9:36 PM

అమల పాల్.. సిద్దార్థ్ హీరోగా నటించిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్, నిజానికి అమలాపాల్ ప్రేమ ఖైదీ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది.

లవ్ ఫెయిల్యూర్ సినిమా సక్సెస్ అవ్వడంతో ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. దాదాపు కుర్రహీరోలందరితో కలిసి సినిమాలు చేసింది ఈ చిన్నది.

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది ఈ చిన్నది. ముఖ్యంగా ఆమె అనే సినిమాలో న్యూడ్ గా నటించి అందరిని అవాక్ అయ్యేలా చేసింది అమలాపాల్. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ధనుష్ తో కలిసి చేసిన రఘువరన్ బీటెక్, వీఐపీ 2 సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం అమలాపాల్ సినిమాలను తగ్గించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టవ్ గా ఉంటూ అందరిని ఆకట్టుకుంది.

నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేసే అమలాపాల్ .. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. డీ గ్లామర్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ నేచురల్ లుక్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మేకప్ లేకున్నా అందంగా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు కుర్రాళ్ళు





























