- Telugu News Photo Gallery Cinema photos Akshay Kumar OMG and Soorarai Pottru remake updates in Bollywood Telugu Entertainment Photos
Akshay Kumar: ఖిలాడీ హీరో రేర్ రికార్డ్.. ట్రెండ్ సెట్ చేసిన అక్షయ్ కుమార్..
ప్రజెంట్ బాలీవుడ్ స్టార్స్ అంతా ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ పాట పాడుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు ఒక్కొక్కరుగా బౌన్స్ బ్యాక్ అవుతూ, బాలీవుడ్ ఫ్యూచర్ మీద ఆశలు కల్పిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరిన ఖిలాడీ హీరో రేర్ రికార్డ్ సెట్ చేశారు.బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ రేర్ రికార్డ్ సెట్ చేశారు. రీసెంట్‌గా ఓ మై గాడ్ 2తో ఆడియన్స్ ముందుకు వచ్చిన అక్కి, ఆ మూవీ సూపర్ హిట్ కావటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Ravi Kiran
Updated on: Aug 23, 2023 | 8:43 PM

ప్రజెంట్ బాలీవుడ్ స్టార్స్ అంతా ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ పాట పాడుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు ఒక్కొక్కరుగా బౌన్స్ బ్యాక్ అవుతూ, బాలీవుడ్ ఫ్యూచర్ మీద ఆశలు కల్పిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరిన ఖిలాడీ హీరో రేర్ రికార్డ్ సెట్ చేశారు.

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ రేర్ రికార్డ్ సెట్ చేశారు. రీసెంట్‌గా ఓ మై గాడ్ 2తో ఆడియన్స్ ముందుకు వచ్చిన అక్కి, ఆ మూవీ సూపర్ హిట్ కావటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దాదాపు ఐదేళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్‌కి ఆ కోరిక తీర్చింది ఓ మై గాడ్ 2.

ఓయంజీ 2 మూవీతో మరో రికార్డ్ కూడా క్రియేట్ చేశారు అక్షయ్ కుమార్. తాజాగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా అక్షయ్ కెరీర్‌లో ఈ మైల్‌స్టోన్ రీచ్ అయిన 16వ సినిమాగా నిలిచింది.

గతంలో వంద కోట్ల క్లబ్‌లో 16 సినిమాలున్న ఒకే హీరో సల్మాన్ ఖాన్. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తన ప్రతీ సినిమాను వంద కోట్ల మార్క్ దాటించేస్తున్నారు భాయ్‌జాన్. అందుకే హయ్యస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ ఉన్న హీరోగా లాంగ్ టైమ్ కొనసాగ గలిగారు.

ఇప్పుడు ఓ మైగాడ్ 2తో అక్షయ్ కూడా ఈ మైల్‌స్టోన్‌కు రీచ్ అవ్వటంతో ఈ ఇద్దరు హీరోల అప్‌కమింగ్ సినిమాల మీద హైప్ పెరుగుతోంది.

ప్రజెంట్ సౌత్ బ్లాక్ బస్టర్ సూరారైపోట్రు రీమేక్‌లో నటిస్తున్నారు అక్షయ్. ఆ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన వంద కోట్ల మార్క్ రీచ్ అవ్వటం ఈజీనే.

ఇక సల్మాన్ టైగర్ 3 వర్క్‌లో బిజీగా ఉన్నారు. భారీగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ, టాక్‌తో సంబంధం లేకుండానే భారీ వసూళ్లు సాధించటం ఖాయం. మరి ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఎవరు రీచ్ అవుతారు, ఎవరు మిస్ అవుతారు.. లెట్స్ వెయిట్ అండ్ సీ.





























