- Telugu News Photo Gallery Cinema photos Heroes new trend in movies with shaved head style Telugu Entertainment Photos
Entertainment: ఇండస్ట్రీలో గుండే ట్రెండ్.. చిరు నుండి షారుక్ వరకు.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్.
షారూఖ్ ఖాన్ హీరోగా సౌత్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా జవాన్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీవ్యూకి ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్లింప్స్‌లో షారూఖ్ గుండుతో కనిపించటంతో రీసెంట్ టైమ్స్‌లో అలా గుండుతో నటిస్తున్న స్టార్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్.జవాన్ సినిమా కోసం చాలా రిస్క్ చేశారు బాద్ షా. ఫస్ట్ టైమ్ ఓ సౌత్ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్న షారూఖ్..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Ravi Kiran
Updated on: Aug 23, 2023 | 8:43 PM

షారూఖ్ ఖాన్ హీరోగా సౌత్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా జవాన్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీవ్యూకి ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్లింప్స్‌లో షారూఖ్ గుండుతో కనిపించటంతో రీసెంట్ టైమ్స్‌లో అలా గుండుతో నటిస్తున్న స్టార్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్.

జవాన్ సినిమా కోసం చాలా రిస్క్ చేశారు బాద్ షా. ఫస్ట్ టైమ్ ఓ సౌత్ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్న షారూఖ్... ఆ మూవీ కోసం గుండుతో కనిపించటం ఆసక్తికరంగా మారింది. షారూఖ్ లాంటి సూపర్ స్టార్ ఇలా కనిపించటంతో సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి.

షారుఖ్ చేసిన అదే ప్రయోగాన్ని నెక్స్ట్ సల్మాన్ చేస్తారని టాక్. నెక్స్ట్ విష్ణువర్ధన్‌తో చేయబోయే సినిమాలో గుండుతో కనిపిస్తారనే మాట బాలీవుడ్‌లో వైరల్ అవుతోంది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా తన నెక్ట్స్ మూవీలో గుండుతో కనిపించబోతున్నారు. కెప్టెన్ మిల్లర్ కోసం చాలా కాలంగా లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్ మెయిన్‌టైన్ చేసిన మిస్టర్ డీ, అందుకే తన నెక్ట్స్ మూవీలో కంప్లీట్ కాంట్రాస్ట్‌గా గుండుతో నటిస్తున్నారు. ఈ సినిమాను ధనుష్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు.

పుష్ప సినిమాలో గుండుతో నటిస్తున్నారు మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్. తొలి భాగంలో కొద్ది సేపే కనిపించిన ఫాఫా, సీక్వెల్‌లో ఫుల్ లెంగ్త్ రోల్‌లో బన్నీని ఢీ కొనబోతున్నారు.

మరో మలయాళ హీరో మోహన్‌లాల్ కూడా ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలో గుండుతోనే నటిస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బారోజ్ మూవీ కోసం డిఫరెంట్ గెటప్ ట్రై చేస్తున్నారు మోహన్‌లాల్.

ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి కూడా గుండు లుక్ ఎలా ఉంటుందో ట్రై చేశారు. ఏ సినిమా కోసం అన్నది క్లారిటీ ఇవ్వకపోయినా... అప్పట్లో మెగాస్టార్ షేవ్డ్ లుక్ తెగ వైరల్ అయ్యింది.





























