- Telugu News Photo Gallery Cinema photos Actor Prakash Raj gets trolled for congratulating ISRO on the success of Chandrayaan 3 mission
Prakash Raj: ఇప్పుడేమంటావ్ రాజా..! చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ప్రకాష్ రాజ్ పై పేలుతున్న పంచ్‌లు
చంద్రయాన్ 3 సక్సెస్ ఫుల్ గా చంద్రుడి పై ల్యాండ్ అయ్యింది. దిగ్విజయంగా చంద్రయాన్ 3 జబ్బిలి పై ల్యాండ్ అవ్వడంతో దేశమంతా ఇస్రో పై ప్రశంసలు కురిపిస్తుంది.చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండర్ ను దించిన మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేసింది. చంద్రయాన్ సక్సెస్ అవ్వడంతో దేశమంతా ఇస్రో పై ప్రశంసలు కురిపిస్తుంది. దేశ ప్రజలందరూ జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇస్రో శాస్త్రవేత్తల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Updated on: Aug 24, 2023 | 9:39 PM

చంద్రయాన్ 3 సక్సెస్ ఫుల్ గా చంద్రుడి పై ల్యాండ్ అయ్యింది. దిగ్విజయంగా చంద్రయాన్ 3 జబ్బిలి పై ల్యాండ్ అవ్వడంతో దేశమంతా ఇస్రో పై ప్రశంసలు కురిపిస్తుంది.చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండర్ ను దించిన మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేసింది.

చంద్రయాన్ సక్సెస్ అవ్వడంతో దేశమంతా ఇస్రో పై ప్రశంసలు కురిపిస్తుంది. దేశ ప్రజలందరూ జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇస్రో శాస్త్రవేత్తల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదే క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్. చంద్రయాన్ 3 ప్రయోగం పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చంద్రయాన్-3 ప్రయోగాన్ని అవహేళన చేసేలా ఆయన పోస్ట్ ఉందని విమర్శించారు. కొంతమంది ఆయన పై పోలీస్ కేసు కూడా పెట్టారు.

చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ షేర్ చేశారు. చంద్రయాన్-3 సక్సెస్ కావడం దేశానికే గర్వకారణం అని అన్నారు ప్రకాష్ రాజ్. అయితే ఆయనను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రయోగానికి ముందు అలా.. ఇప్పుడు ఇలా అంటూ ప్రకాష్ రాజ్ పై ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ లో ఈ మానవ ప్రయత్నానికి దండం అంటూ ఓ ట్వీట్ ను షేర్ చేశారు. చంద్రయాన్ 3, విక్రమ్ ల్యాండర్, ఇస్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు. ఇది దేశానికే గర్వకారణమైన సంఘటన అంటూ రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్.




