- Telugu News Photo Gallery Cinema photos Actress Hansika Motwani shared her latest black and white photos on social media
Hansika Motwani : బ్లాక్ అండ్ వైట్‌లో బీభత్సం సృష్టిస్తున్న హన్సిక.. అమ్మడి వయ్యారాలకు కుర్రకారు ఫిదా
టాలీవుడ్ లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక మోత్వానీ. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హన్సిక అందానికి, క్యూట్ నెస్ కు కుర్రాలంతా ఫిదా అయ్యారు. ఆతర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది హన్సిక. ఎన్టీఆర్, రామ్ పోతినేని, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.
Rajeev Rayala | Edited By: Ravi Kiran
Updated on: Aug 24, 2023 | 9:38 PM

టాలీవుడ్ లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక మోత్వానీ. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హన్సిక అందానికి, క్యూట్ నెస్ కు కుర్రాలంతా ఫిదా అయ్యారు.

ఆతర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది హన్సిక. ఎన్టీఆర్, రామ్ పోతినేని, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.

తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అంతే కాదు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ చేసింది హన్సిక. ఇటీవలే పెళ్లి పీటలు కూడా ఎక్కింది హన్సిక . ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాలు తగ్గించింది.

లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటుంది హన్సిక. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ వయ్యారి భామ.

ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ను షేర్ చేసింది హన్సిక. సూట్ వేసుకొని వయ్యారాలు ఫోటో ఫోటోలకు ఫోజులిచ్చింది హన్సిక. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

స్టైలిష్ లుక్స్ తో అదిరిపోతున్న ఈ ఫొటోస్ కు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళైనా కూడా హన్సిక అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు మంచి ఛాన్స్ వస్తే తెలుగులో నటించాలని ఎదురుచూస్తుంది.





























