AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: పొర్లు దండాలతో తిరుమలకు చిరంజీవి అభిమాని.. మెగాస్టార్‌ ఆరోగ్యంగా ఉండాలంటూ 20 ఏళ్లుగా సాహస యాత్ర

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా మెగాస్టార్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. ఇక చిరంజీవి అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలతో పాటు ఆస్పత్రులు, అనాథశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. ఇక మరికొంతమంది అభిమానులైతే చిరంజీవి ఆరోగ్యం బాగుండాలంటూ చాలా చోట్ల దేవాలయాల్లో పూజలు కూడా జరిపారు

Chiranjeevi: పొర్లు దండాలతో తిరుమలకు చిరంజీవి అభిమాని.. మెగాస్టార్‌ ఆరోగ్యంగా ఉండాలంటూ 20 ఏళ్లుగా సాహస యాత్ర
Chiranjeevi Fan Eswar Royal
Basha Shek
|

Updated on: Aug 23, 2023 | 7:30 PM

Share

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా మెగాస్టార్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. ఇక చిరంజీవి అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలతో పాటు ఆస్పత్రులు, అనాథశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. ఇక మరికొంతమంది అభిమానులైతే చిరంజీవి ఆరోగ్యం బాగుండాలంటూ చాలా చోట్ల దేవాలయాల్లో పూజలు కూడా జరిపారు. అయితే ఒక వీరాభిమాని మాత్రం పొర్లు దండాలు పెట్టుకుంటూ తిరుమల శ్రీవారి చెంతకు వెళ్లాడు. తిరుమల జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లికి చెందిన ఈశ్వర్‌ రాయల్‌ శ్రీవారి మెట్టు మార్గంలో 2388 మెట్ల ద్వారా తిరుమలకు పయనమయ్యాడు. చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఒక్కో మెట్టుకు పొర్లు దండాలు పెట్టుకుంటూ తిరుమలకు చేరుకున్నాడు. ఆయన వెంట పలువురు చిరంజీవి అభిమానులు ఉన్నారు. కాగా మెగా ఫ్యామిలీ కోసం ఇలా పూజలు చేయడం ఈశ్వర్‌ రాయల్‌కు కొత్తేమీ కాదు. 2003 నుంచి ఇలాగే పుణ్యక్షేత్రాల్లో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో  జనసేన అధిపతి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ గతేడాది తిరుపతిలోని జపాలి ఆంజనేయస్వామికి ఆలయానికి పొర్లు దండాలు పెడుతూ చేరుకున్నాడు. ఏకంగా 270 మెట్లు ఎక్కి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్న ఈశ్వర్‌ పవన్‌ సీఎం కావాలంటూ ప్రత్యేక పూజలు చేశాడు

ఇక గతేడాది మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని పొర్లు దండాలు పెడుతూ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకున్నాడు. అంతకుముందు కూడా తిరుపతి నుంచి కొండగట్టు దేవాలయానికి సైకిల్‌ యాత్ర చేపట్టాడు. ఈ ఏడాది మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని కూడా ఇలాగే పొర్లు దండాలు పెడుతూ జపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాడు. ‘నేను ఎంతగానో అభిమానించే చిరంజీవి ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలోని అందరూ బాగుండాలనే ఇలా ఏటా పొర్లు దండాలు పెడుతూ పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నాను. చిరంజీవి అన్నయ్య రాజకీయాల్లోకి రావాలని గతంలో పొర్లుదండాలు పెట్టాను. అలాగే పాలిటిక్స్‌ నుంచి బయటకు వచ్చాక కూడా సినిమాలు తీయాని కోరుకున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా పవన్‌ కల్యాణ్‌ ను చూడాలని ఉంది’ అని కోరుకుంటున్నాడీ వీరాభిమాని.

ఇవి కూడా చదవండి

ఈశ్వర్ రాయల్ పొర్లు దండాల వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్