Asia Cup 2023: ఆసియాకప్‌లో సందడి చేయనున్న అందాల యాంకరమ్మలు.. ఎవరెవరున్నారో తెలుసా?
ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌లో సందడి చేయనున్న యాంకర్ల జాబితాను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ విడుదల చేసింది. ఈ ఐదుగురిలో ఇద్దరు మేల్ యాంకర్లు కాగా, మిగిలిన ముగ్గురు మహిళా వ్యాఖ్యాతలు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆ మహిళా యాంకర్ల వివరాలేంటో తెలుసుకుందాం రండి.
Updated on: Aug 23, 2023 | 8:29 PM

ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌లో సందడి చేయనున్న యాంకర్ల జాబితాను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ విడుదల చేసింది. ఈ ఐదుగురిలో ఇద్దరు మేల్ యాంకర్లు కాగా, మిగిలిన ముగ్గురు మహిళా వ్యాఖ్యాతలు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆ మహిళా యాంకర్ల వివరాలేంటో తెలుసుకుందాం రండి.

మయాంతి లాంగర్: టీమిండియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కోడలు మయాంతి లాంగర్ స్పోర్ట్స్ యాంకరింగ్ సుపరిచితమైన పేరు. స్టార్ స్పోర్ట్స్‌లో చాలా కాలంగా పనిచేస్తుందామె. భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేసే దాదాపు అన్ని సిరీస్‌లకు మయంతి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మయాంతి ఎక్కువగా స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్ ఛానెల్‌లలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మయాంటికి ఇన్‌స్టాగ్రామ్‌లో 7.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

జైనాబ్ అబ్బాస్: కింగ్ కోహ్లీతో కలిసి ఫోటోలు దిగి సంచలనం సృష్టించిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నాసిర్ అబ్బాస్ కూతురు ఈసారి ఆసియా కప్‌లో టీవీ యాంకర్‌గా దర్శనమిస్తోంది.

2015లో స్థానిక ఛానెల్‌లో కెరీర్ ప్రారంభించిన జైనాబ్ అబ్బాస్, 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి టీవీ ప్రెజెంటర్‌గా కనిపించింది. ప్రస్తుతం జైనాబ్ అబ్బాస్ టీ20 లీగ్‌లలో టీవీ వ్యాఖ్యాతగా హాజరవుతోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

జైతీ ఖేరా: OTT ఫ్లాట్ ఫారమ్‌లో ఆకట్టుకున్న కోటా ఫ్యాక్టరీ సీజన్ 2, ఢిల్లీ క్రైమ్ సీజన్-1లో కనిపించిన నటి జైతీ ఖేరా ఈ ఆసియా కప్‌లో టీవీ హోస్ట్‌గా కూడా కనిపించనున్నారు. జైతీ ఖేరా ఆసియా కప్‌లోనే కాకుండా ఇంతకుముందు ఐపీఎల్‌లో కూడా టీవీ వ్యాఖ్యాతగా కనిపించారు.