- Telugu News Photo Gallery Cricket photos Team India Star Spinner yuzvendra chahal may missed 3 icc events in 3 years after asia cup sqaud annnounced
Team India: 3 ఏళ్లలో మూడోసారి మిస్.. ప్రపంచకప్ జట్టులో ఆడాలన్న కల ‘కల’గానే మిగిలే.. ఎవరంటే?
Indian Cricket: ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన జట్టులో భారత జట్టులోని ఒక బిగ్ మ్యాచ్ విన్నర్ ప్లేయర్‌కు చోటు దక్కలేదు. ఈ ఆటగాడు 3 సంవత్సరాలలో మూడోసారి ప్రపంచకప్‌ను ఆడే అవకాశాన్ని కోల్పోయే అంచున నిలబడ్డాడు. చాహల్‌తోపాటు కుల్దీప్ యాదవ్‌ల మణికట్టు స్పిన్నర్‌ల జోడీ కుల్-చా అనే మారుపేరుతో ప్రసిద్ధి చెందింది. కుల్దీప్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. అయితే రవీంద్ర జడేజా బంతితోనూ, బ్యాటింగ్‌లోనూ సహకారం అందించగలడు. దీంతో చాహల్ స్థానంలో అక్షర్ పటేల్‌పైనే సెలెక్టర్లు విశ్వాసం ఉంచారు.
Updated on: Aug 23, 2023 | 11:57 AM

Indian Cricket Team: భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆసియా కప్‌నకు ఎంపిక చేసిన 17 మంది సభ్యుల భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ కారణంగా చాహల్ మరోసారి ప్రపంచ కప్ మ్యాచ్‌లకు దూరమయ్యే అంచున నిల్చున్నాడు. చాహల్ గత రెండు టీ20 ప్రపంచకప్‌లలో స్థానం పొందలేదు. అయితే 2022 టీ20 ప్రపంచకప్‌లో జట్టులో ఉన్నా కూడా ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించలేదు.

అయితే, ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌నకు కూడా ఈ స్టార్ స్పిన్నర్‌కు చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. అయితే, రోహిత్ శర్మ మాత్రం చాహల్ కోసం జట్టు తలుపులు పూర్తిగా మూసివేయలేదు. జట్టులో చోటు సంపాదించుకోవచ్చని అన్నాడు. చాహల్ ఒకప్పుడు మిడిల్ ఓవర్లలో భారత బౌలింగ్‌కు వెన్నెముకగా పేరుగాంచాడు.

చాహల్‌తోపాటు కుల్దీప్ యాదవ్‌ల మణికట్టు స్పిన్నర్‌ల జోడీ కుల్-చా అనే మారుపేరుతో ప్రసిద్ధి చెందింది. కుల్దీప్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. అయితే రవీంద్ర జడేజా బంతితోనూ, బ్యాటింగ్‌లోనూ సహకారం అందించగలడు. దీంతో చాహల్ స్థానంలో అక్షర్ పటేల్‌పైనే సెలెక్టర్లు విశ్వాసం ఉంచారు.

ప్రపంచకప్‌లో భారత జట్టు మేనేజ్‌మెంట్ ఫాస్ట్ బౌలర్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కుల్దీప్, జడేజా, అక్షర్ వంటి స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో తరచూ విరామాల్లో జట్టు వికెట్లు పడగొట్టగలరా అనేది ఆసక్తికరంగా మారింది. చాహల్‌ను జట్టులో ఉంచకపోవడం వల్ల గత ఆసియాకప్‌లో లాగా భారత్ మరోసారి భారం మోయాల్సి వస్తుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

చాహల్‌ను మినహాయించడం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ "మేం అశ్విన్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఆఫ్ స్పిన్నర్‌ను ఉంచాలని ఆలోచిస్తున్నాం. కానీ, ఇప్పుడు మా వద్ద 17 మంది ఉన్నందున చాహల్‌ను పక్కన పెట్టాం. వచ్చే రెండు నెలల్లో ఫాస్ట్ బౌలర్ల పాత్ర చాలా కీలకం కానున్నందున మేం దీన్ని చేయలేకపోయాం. వారిలో కొందరు చాలా కాలం తర్వాత పునరాగమనం చేస్తున్నారు. కాబట్టి, మేం వారిని బాగా పరిశీలించి, జట్టుకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటారో చూడాలనుకుంటున్నాం" అంటూ చెప్పుకొచ్చాడు.




