- Telugu News Photo Gallery Cinema photos Global Star Ram Charan Upcoming Movie with director buchi babu sana full details here Telugu Heros Photos
Ram charan: రామ్ చరణ్ పై స్పెషల్ ఫోకస్.. బుచ్చిబాబు మూవీపై ఆసక్తి రేపుతున్న సీన్.
స్టార్ హీరోల సినిమాలన్నాక ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా ఎందుకుంటున్నా. సెట్స్ మీదుంటే ఒక రకమైన క్రేజ్, అనౌన్స్ మెంట్ అయితే ఇంకో క్రేజ్. ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాలకు సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్ కి అయితే ఫెస్టివలే. ఇప్పుడు అలాంటి ఫెస్టివ్ మూడ్‌లోనే ఉన్నారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు. రామ్‌చరణ్ ఇంకా ట్రిపుల్ ఆర్ కోసం ఆస్కార్ ప్రాంగణంలో తిరుగుతున్నట్టే ఉంది. ఆ సందడిని ఇంకా ఫ్యాన్స్ మర్చిపోనే లేదు.
Updated on: Aug 27, 2023 | 7:07 PM

స్టార్ హీరోల సినిమాలన్నాక ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా ఎందుకుంటున్నా. సెట్స్ మీదుంటే ఒక రకమైన క్రేజ్, అనౌన్స్ మెంట్ అయితే ఇంకో క్రేజ్. ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాలకు సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్ కి అయితే ఫెస్టివలే.

ఇప్పుడు అలాంటి ఫెస్టివ్ మూడ్‌లోనే ఉన్నారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు. రామ్‌చరణ్ ఇంకా ట్రిపుల్ ఆర్ కోసం ఆస్కార్ ప్రాంగణంలో తిరుగుతున్నట్టే ఉంది. ఆ సందడిని ఇంకా ఫ్యాన్స్ మర్చిపోనే లేదు.

పాప క్లింకార బర్త్ డే సెలబ్రేషన్స్ కళ్లముందే మెదులుతున్నాయి. అప్పుడే ఇంకో సందడి మొదలైంది. ట్రిపుల్ ఆర్‌కి ఆస్కార్ రావడంతో, మరోసారి అభిమాన హీరోని గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. నాటు నాటు అంటూ స్టెప్పులేస్తున్నారు.

ఇదే నేషనల్ అవార్డు అనౌన్స్ మెంట్‌లోనే రామ్‌చరణ్‌కి బోనస్ అయ్యే విషయం ఇంకోటి అనౌన్స్ అయింది. రామ్‌చరణ్ నెక్స్ట్ మూవీ డైరక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాకు అవార్డు వచ్చింది.

దీంతో ఆర్‌సీ 16ని ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. రెండు నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలకు పనిచేసిన వారు కలిసి చేసే ఆర్‌సీ 16 ఇంకే రేంజ్‌లో ఉంటుందో నని మెస్మరైజ్ అవుతున్నారు.

ఫ్యాన్స్ ఊహించుకోవడం ఓ ఎత్తయితే, ఇంకాస్త ఊరించేలా లీక్స్ ఇస్తున్నారు కెప్టెన్ బుచ్చిబాబు. ఆర్‌సీ 16 గురించి ఎంత ఊహించుకున్నా, అంతకు మించే ఉంటుందని, అదిరిపోయే కాన్సెప్ట్ కుదిరిందని చెబుతున్నారు కెప్టెన్.

చరణ్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని హింట్ ఇస్తున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్‌లో నటిస్తున్నారు రామ్‌చరణ్‌తేజ్. ఈ సినిమా షూటింగ్ నల్గొండ సమీపంలో జరుగుతోంది.

ఒన్స్ ఈ షూట్ కంప్లీట్ కాగానే బుచ్చిబాబు సెట్స్ లోకి వెళ్తారు చరణ్. గేమ్ చేంజర్‌ని శంకర్ ఎలా ప్లాన్ చేస్తున్నారో, అంతకు మించి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుచ్చిబాబు.




