- Telugu News Photo Gallery Cinema photos Nayanthara, Vignesh Shivan Celebrates 1st Onam With Twins, Photos Goes Viral
Nayanthara: ఓనమ్ వేడుకల్లో నయనతార ఫ్యామిలీ.. పంచెకట్టులో దర్శనమిచ్చిన కవల పిల్లలు.. క్యూట్ ఫొటోస్ చేశారా?
కేరళ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఓనమ్ పండగను అక్కడి ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. సామాన్యులతో సహా స్టార్ సెలబ్రిటీలు ఈ పర్వదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకొంటారు.ఈ క్రమంలో సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార తన ఫ్యామిలీతో కలిసి ఓనం పండగను వేడుకగా సెలబ్రేట్ చేసుకుంది.
Updated on: Aug 27, 2023 | 8:33 PM

కేరళ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఓనమ్ పండగను అక్కడి ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. సామాన్యులతో సహా స్టార్ సెలబ్రిటీలు ఈ పర్వదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకొంటారు.ఈ క్రమంలో సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార తన ఫ్యామిలీతో కలిసి ఓనం పండగను వేడుకగా సెలబ్రేట్ చేసుకుంది.

తన భర్త విగ్నేష్ శివన్, ఇద్దరు కవల పిల్లలు ఉయిర్, ఉలగన్‌తో కలిసి ఓనం ఫెస్టివల్‌ను జరుపుకొంది నయనతార. కాగా కవల పిల్లలు పుట్టాక నయన్, విగ్నేష్ తొలిసారి ఓనం సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం నయనతార ఫ్యామిలీ ఓనం సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

' ఉయిర్, ఉలగన్ లతో ఇది తొలి ఓనం. అందరికి ఓనం శుభాకాంక్షలు' అంటూ తన ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విఘ్నేష్ శివన్. ఇందులో పంచెకట్టుతో ఎంతో క్యూట్‌గా కనిపించారు ట్విన్స్.

. అయితే తమ పిల్లల ముఖాలను మాత్రం చూపించడం లేదు నయనతార. వెనుక నుంచి మాత్రమే చూపించారు. ముద్దొస్తున్న కవల పిల్లలు అరిటాకుల్లో భోజనం చేస్తున్న ఫొటోలు ఫ్యాన్స్, నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆమె నటించిన మొదటి బాలీవుడ్ సినిమా జవాన్ మరో 10 రోజుల్లో విడుదల కానుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.