National Film Awards 2023: ఓటీటీలో జాతీయ అవార్డు గెల్చుకున్న సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ చూడచ్చంటే?

National Film Award Movies in OTT: భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను గురువారం (ఆగస్టు 24)న సాయంత్ర ప్రకటించారు. 2021 ఏడాదికి గానూ ఈ పురస్కారాలను ప్రకటించారు. ఢిల్లీలోని నేషనల్‌ మీడియా సెంటర్‌ వేదికగా అనౌన్స్‌ చేసిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఈ సారి తెలుగు సినిమాల హవా నడిచింది. పుష్ప సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు అల్లు అర్జున్‌. ఈ సినిమాకే బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవార్డును అందుకోనున్నాడు దేవిశ్రీప్రసాద్‌.

National Film Awards 2023: ఓటీటీలో జాతీయ అవార్డు గెల్చుకున్న సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ చూడచ్చంటే?
National Film Awards 2023 Winning Movies
Follow us
Basha Shek

|

Updated on: Aug 25, 2023 | 12:49 PM

National Film Award Movies in OTT: భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను గురువారం (ఆగస్టు 24)న సాయంత్ర ప్రకటించారు. 2021 ఏడాదికి గానూ ఈ పురస్కారాలను ప్రకటించారు. ఢిల్లీలోని నేషనల్‌ మీడియా సెంటర్‌ వేదికగా అనౌన్స్‌ చేసిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఈ సారి తెలుగు సినిమాల హవా నడిచింది. పుష్ప సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు అల్లు అర్జున్‌. ఈ సినిమాకే బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవార్డును అందుకోనున్నాడు దేవిశ్రీప్రసాద్‌. ఇక పాన్‌ ఇండియా స్థాయిలో రికార్డులు తిరగరాసిన ఆర్‌ఆర్‌ఆర్ ఏకంగా ఆరు అవార్డులు కైవసం చేసుకుంది. అలాగే బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన, క్రిష్‌ దర్శకత్వం వహించిన కొండపొలం సినిమాలు కూడా వివిధ విభాగాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెల్చుకున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి అలియా భట్‌, కృతిసనన్‌ ఉత్తమ నటీమణులుగా జాతీయ పురస్కారాలు అందుకోనున్నారు. ఇదే క్రమంలో బెస్ట్ మూవీగా నంబి.. ది రాకెట్రీ నిలవగా.. ది కశ్మీర్ ఫైల్స్ కు జాతీయ సమగ్రతపై తీసిన బెస్ట్ మూవీగా నర్గీస్ దత్ పురస్కారం లభించింది. కాగా జాతీయ అవార్డులు గెలిచిన సినిమాలన్నీ ప్రస్తుతం ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. మరి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందో తెలుసుకుందాం రండి.

జాతీయ అవార్డులు గెల్చుకున్న సినిమాలు, ఓటీటీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఫుల్‌ డీటెయిల్స్‌ ఇవే

  • ఆర్ఆర్ఆర్ – జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
  • పుష్ప ది రైజ్‌- అమెజాన్‌ ప్రైమ్ వీడియో
  • ఉప్పెన – నెట్‌ఫ్లిక్స్
  • కొండపొలం – నెట్‌ఫ్లిక్స్
  • రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ – జియో సినిమా
  • ది కశ్మీర్ ఫైల్స్ – జీ5
  • 777 ఛార్లీ- జియో సినిమా
  • అలియా భట్‌ గంగూబాయి కఠియావాడి- నెట్‌ఫ్లిక్స్
  • కృతి సనన్ మిమీ- నెట్‌ఫ్లిక్స్‌, జియో సినిమా
  • షేర్షా – అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • సర్దార్ ఉధమ్ సింగ్- అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • హోమ్‌ (మలయాళం)- అమెజాన్ ప్రైమ్ వీడియో
  • ఛెల్లో షో (గుజరాతి)- నెట్‌ ఫ్లిక్స్‌
  • ఆవాసవ్యూహం (మలయాళం)- సోని లివ్‌
  • నాయట్టు: ది హంట్‌ (మలయాళం)- నెట్‌ ఫ్లిక్స్‌
  • ఏక్ దువా – జియోసినిమా
  • గోదావరి (మలయాళం) – జియో సినిమా
  • ఇరవిన్ నిజాల్ (తమిళ్) – అమెజాన్‌ ప్రైమ్ వీడియో
  • మెప్పడియాన్ (మలయాళం) – అమెజాన్‌ ప్రైమ్ వీడియో
  • కడైసి వివాహాయి (తమిళ్‌) – సోనీ లివ్‌

పుష్పరాజ్ కు అమెజాన్ ప్రైమ్ వీడియో విషెస్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..