AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: ఆసియా కప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. విరాట్‌తో గొడవపడిన నవీల్‌ ఉల్‌ హక్‌కు నో ప్లేస్‌.. కారణమిదే..

ప్రతిష్ఠత్మక ఆసియా కప్‌ ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించారు. మొత్తం 17 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి హష్మతుల్లా షాహిదీ నేతృత్వం వహిస్తారు. అయితే ఈ జట్టులో అఫ్గాన్‌ యువ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌కు చోటు దక్కలేదు. గతంలో నవీన్ ఉల్ హక్ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో గొడవపడి వార్తల్లో నిలిచాడు. దీంతో ఆసియా కప్‌లో నవీన్, కోహ్లి మధ్య ఆసక్తికర పోరు జరుగుతుందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ భావించారు. అయితే 17 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్

Asia Cup 2023: ఆసియా కప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. విరాట్‌తో గొడవపడిన నవీల్‌ ఉల్‌ హక్‌కు నో ప్లేస్‌.. కారణమిదే..
Naveen Ul Haq, Virat Kohli
Basha Shek
|

Updated on: Aug 27, 2023 | 9:51 PM

Share

ప్రతిష్ఠత్మక ఆసియా కప్‌ ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించారు. మొత్తం 17 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి హష్మతుల్లా షాహిదీ నేతృత్వం వహిస్తారు. అయితే ఈ జట్టులో అఫ్గాన్‌ యువ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌కు చోటు దక్కలేదు. గతంలో నవీన్ ఉల్ హక్ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో గొడవపడి వార్తల్లో నిలిచాడు. దీంతో ఆసియా కప్‌లో నవీన్, కోహ్లి మధ్య ఆసక్తికర పోరు జరుగుతుందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ భావించారు. అయితే 17 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్. మరోవైపు 6 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్ జట్టులో చోటు దక్కించుకోవడంలో కరీం జనత్ సక్సెస్ అయ్యాడు. చివరిసారిగా 2017లో జింబాబ్వేపై వన్డే ఆడిన జనత్ ఇప్పుడు ఆసియా కప్ ద్వారా పునరాగమనం చేస్తున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఫరీద్ అహ్మద్ మాలిక్, షాహిదుల్లా కమల్‌లను జట్టు నుంచి తప్పించారు. అలాగే, పాకిస్థాన్‌తో జరిగిన చివరి వన్డేలో గాయపడిన అజ్మతుల్లా ఒమర్జాయ్ స్థానంలో గుల్బాదిన్ నైబ్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు:

హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, ముద్దీన్ అష్రమాన్, అబ్దుల్ రహ్మాన్ రెహమాన్ రెహమాన్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్ సఫీ, ఫజల్హాక్ ఫరూఖీ.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ షెడ్యూల్:

  • ఆగస్టు 30- పాకిస్థాన్ vs నేపాల్ (ముల్తాన్)\
  • ఆగస్టు 31- బంగ్లాదేశ్ vs శ్రీలంక (కాండీ)
  • సెప్టెంబరు 2- భారత్ vs పాకిస్థాన్ (కాండీ)
  • సెప్టెంబర్ 3- బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)
  • సెప్టెంబర్ 4- భారత్ vs నేపాల్ (కాండీ)
  • సెప్టెంబర్ 5- శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)
  • సూపర్-4 దశ షెడ్యూల్
  • సెప్టెంబర్ 6- A1 Vs B2 (లాహోర్)
  • సెప్టెంబర్ 9- B1 Vs B2 (కొలంబో)
  • సెప్టెంబర్ 10- A1 Vs A2 (కొలంబో)
  • సెప్టెంబర్ 12- A2 Vs B1 (కొలంబో)
  • సెప్టెంబర్ 14- A1 Vs B1 (కొలంబో)
  • సెప్టెంబర్ 15- A2 Vs B2 (కొలంబో)
  • సెప్టెంబర్ 17- ఫైనల్ (కొలంబో)

ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇదే..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..