Actress Rohini: బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్‌.. డిప్రెషన్‌తో నరకం అనుభవించా: జబర్దస్త్ ఫేమ్ రౌడీ రోహిణి

టాలీవుడ్‌ బుల్లితెరపై సత్తాచాటుతోన్న లేడీ కమెడియన్లలో రౌడీ రోహిణీ ఒకరు. మొదట సీరియల్స్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత బిగ్‌బాస్‌షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రముఖ కామెడీ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి టీమ్‌ లీడర్‌ దాకా ఎదిగింది. జబర్దస్త్‌లో రోహిణీ వేసే కామెడీ పంచులు, ప్రాసలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉన్నారు. కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా రాణిస్తోందీ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌. సినిమాలతో పాటు సేవ్‌ ది టైగర్స్‌

Actress Rohini: బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్‌.. డిప్రెషన్‌తో నరకం అనుభవించా: జబర్దస్త్ ఫేమ్  రౌడీ రోహిణి
Actress Rohini
Follow us
Basha Shek

|

Updated on: Aug 27, 2023 | 9:31 PM

టాలీవుడ్‌ బుల్లితెరపై సత్తాచాటుతోన్న లేడీ కమెడియన్లలో రౌడీ రోహిణీ ఒకరు. మొదట సీరియల్స్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత బిగ్‌బాస్‌షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రముఖ కామెడీ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి టీమ్‌ లీడర్‌ దాకా ఎదిగింది. జబర్దస్త్‌లో రోహిణీ వేసే కామెడీ పంచులు, ప్రాసలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉన్నారు. కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా రాణిస్తోందీ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌. సినిమాలతో పాటు సేవ్‌ ది టైగర్స్‌ లాంటి వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తోంది. కాగా ఇటీవల కొన్ని అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరింది రోహిణీ. తన కాలుకు ట్రీట్‌మెంట్‌లో భాగంగా కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండిపోయింది. చాలా రోజుల క్రితం రోహిణి ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమె కాలుకు తీవ్ర గాయం అయ్యింది. చికిత్సలో భాగంగా తన కుడి కాలులో రాడ్డు అమర్చారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ రాడ్డు తొలగించాల్సి వచ్చింది. అయితే అటు టీవీ షోలు, సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉండటంతో అది సాధ్యపడలేదు. అయితే కొన్ని రోజుల క్రితం రాడ్డు తొలగించే ప్రక్రియలో భాగంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమయంలో తన భయానక అనుభవవాలను యూట్యూబ్‌లో షేర్‌ చేసుకుంది రోహిణీ. ప్రస్తుతం కొంతమేర కోలుకున్న ఆమె మళ్లీ స్క్రీన్‌పై కనిపించేందుకు రెడీ అయింది.

కాగా తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రోహిణీకి బ్రేకప్‌ అయ్యింది. ఆ కారణంగా డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయిందామె. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టిందామె. ఓ షోలో తన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రోహిణీ.. ‘నాకు ఒకప్పుడు బాయ్‌ ఫ్రెండ్‌ ఉండేవాడు. అయితే ఇప్పుడు బ్రేకప్‌అయ్యింది. కొన్ని విభేదాల వల్ల విడిపోయాం. ఈ సమయంలో నేను చాలా నరకం అనుభవించాను. డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయాను. ఆ సమయంలో నా ఫ్రెండ్స్‌ ఎంతగానో సపోర్టుగా నిలిచారు. ‘అసలు వాడెవడు.. నీ కాలి గోటికి కూడా సరిపోడు’ అంటూ నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు. అలా వారి సపోర్ట్‌తోనే ఆ కష్ట సమయం నుంచి బయటపడ్డాను’ అని రోహిణి తెలిపింది. ప్రస్తుతం ఈ లేడీ కమెడియన్‌ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ రోహిణీని ప్రేమించి వదిలేసిన అబ్బాయి ఎవరా? అని నెటిజన్లు తెగ ఆరాతీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రౌడీ రోహిణీ లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ ఫొటోస్

View this post on Instagram

A post shared by Rohini (@actressrohini)

రౌడీ రోహిణీ లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

View this post on Instagram

A post shared by Rohini (@actressrohini)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.